
ముషీరాబాద్, వెలుగు : కేసీఆర్‌ది కుటుంబ పాలన అయితే.. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర అని ముషీరాబాద్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం ముషీరాబాద్‌లోని వివిధ బస్తీల్లో టీజేఎస్, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేయబోయే పనులను వివరించారు. తాను రెండుసార్లు ఎంపీగా ఉన్న సమయంలో ముషీరాబాద్ సెగ్మెంట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు న్యాయం దక్కేలా ఉందన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ నేత నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.