రోడ్డెక్కితే ముందూ వెనకా చూసుకోవాలి.. అది కారు అయినా బైక్ అయినా.. ఇక హైవేపై వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. హైవే జంక్షన్ దగ్గర అయితే మరింత అప్రమత్తంగా.. అటూ ఇటూనే కాదు.. దూరంగా వచ్చే వాహనాల వేగాన్ని సైతం అంచనా వేస్తూ వెళ్లాలి. లేకపోతే ఘోర ప్రమాదాలు జరుగుతాయి. జాతీయ రహదారులపై వాహనాల వేగం 100, 120 కిలోమీటర్ల వరకు ఉంటుంది.. అలాంటి రహదారులపై బైక్ రైడర్స్ అయినా.. కారు డ్రైవర్లు అయినా అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకపోతే ఘోర ప్రమాదాలు ఖాయం.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ సిటీలో జాతీయ రహదారిపై జరిగిన ఈ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత.. తప్పు బైక్ రైడర్లదా.. కారుదా అని మీరు చెప్పండి..
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో మంగళవారం (డిసెంబర్ 16) ఓ క్రాసింగ్ దగ్గర వేగంగా వస్తున్న కారు స్కూటీని ఢీకొట్టింది. దింతో స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు గాల్లోకి ఎగిరి రోడ్డు పక్కన పడ్డారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం 11 గంటలకు జరగ్గా... ఇదంతా అక్కడ ఉన్న CCTVలో రికార్డైంది.
వీడియోలో స్కూటర్ నడుపుతున్న వ్యక్తి కారు వేగంగా వస్తోందని గమనించకుండా కుడివైపు టర్న్ చేస్తాడు. రోడ్డుపై బ్లాక్ కలర్లో వస్తున్న ఓ హ్యుందాయ్ కారు అతివేగంగా స్కూటర్‌ను ఢీకొడుతుంది.
దింతో స్కూటర్‌తో పాటు రైడర్ కూడా ఎగిరి కొన్ని మీటర్ల దూరం పడిపోయాడు. వెనకాల కూర్చున్న అతను కూడా కొన్ని మీటర్ల దూరంలో గాల్లోకి ఎగిరి పడ్డాడు.
కారు స్కూటర్ ఢీకొన్న తర్వాత స్కూటీ స్కిడ్ అవ్వడంతో రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ వ్యక్తి కూడా గాయపడ్డాడు. ప్రమాదం తర్వాత కారు అపి వెంటనే అందులో కూర్చున్న ఓ వ్యక్తి కారు నుంచి బయటకు దిగడం చూడొచ్చు. అయితే ఈ ఘటన తరువాత రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు ఆగిపోయాయి.
A speeding car hit and injured people riding a scooter in Ahmedabad. Always look left and right before crossing the road. Whose fault do you think it is?#Ahmedabad#CCTV#Accident pic.twitter.com/ObMriqky7U
— Siraj Noorani (@sirajnoorani) December 18, 2025
