హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లో భారీగా ఉద్యోగాలు.. ఐటీఐ/ నిరుద్యోగులకు మంచి ఛాన్స్..

హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లో భారీగా ఉద్యోగాలు..  ఐటీఐ/ నిరుద్యోగులకు మంచి ఛాన్స్..

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 25-.

పోస్టుల సంఖ్య: 156 (ఆపరేటర్). 

ఖాళీల వివరాలు: ఎలక్ట్రానిక్స్ 7, ఫిట్టింగ్ 115, గ్రౌండింగ్ 4, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్/ ఇనుస్ట్రుమెంటేషన్ 05, మ్యాచింగ్ 12, టర్నింగ్ 12, 
ఫిట్టింగ్ 01. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మూడేండ్ల నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ లేదా రెండేండ్ల ఐటీఐతోపాటు ఏడాది నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 15.

లాస్ట్ డేట్: డిసెంబర్ 25. 

సెలెక్షన్ ప్రాసెస్: మెరిట్ ఆధారిత డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు hal-india.co.in వెబ్​సైట్​ను సందర్శించండి.