నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ (ICMR NIRRCH) యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టులు: 4 (యంగ్ ప్రొఫెషనల్స్)
ఎలిజిబిలిటీ: అడ్మిన్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ కళాశాల నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో
పోస్ట్ గ్రాడ్యుయేట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ కళాశాల నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఎం.కాం. లేదా సీఏ (ఇంటర్)/ ఐసీడబ్ల్యూఏ (ఇంటర్)/ సీఎస్ (ఇంటర్) పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: డిసెంబర్ 31.
సెలెక్షన్ ప్రాసెస్: క్వాలిఫికేషన్, అనుభవం, వయసు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అవసరమైతే రాత పరీక్ష నిర్వహిస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
పూర్తి వివరాలకు icmr.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
