తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లా ధర్మారంలోని బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు వెళ్లిన క్రమంలో అడ్డుకునేందుకు ప్రయత్నించారు బీజేపీ కార్యకర్తలు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట నెలకొంది. ఇరువర్గాలు పూటపోటీగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా మోహరించారు పోలీసులు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. సిరిసిల్లలోని బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ క్రమంలో బిల్డింగ్ పై నుండి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. ఇరువర్గాలు పోటాపోటీగా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీ పై ఈడి కేసులను కోర్టు తప్పు పట్టిన క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా సిరిసిల్ల ధర్నాకు దిగారు కాంగ్రెస్ శ్రేణులు.
సిరిసిల్ల లోని బిజెపి కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ సమక్షంలో భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. బీజేపీ ఆఫీసు ముందు వేసిన టెంట్ ను తొలగించారు పోలీసులు.
