బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. నాకెందుకు చెప్పలేదన్న భర్త

బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. నాకెందుకు చెప్పలేదన్న భర్త

బుల్లితెర రియాలిటీ షోలలో బిగ్‌బాస్(Bigg boss) కు ఉన్న క్రేజ్ ప్రత్యేకం. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ షోకు ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు.. చేసిన అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ అయ్యింది ఈ షో. ఇక హీందీలో ఇప్పటికే 16 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం 17వ సీజన్ ప్రసారమవుతోంది. ఈ పాపులర్ షోకి కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేస్తున్నారు. 

ఇక ఇటీవలే మొదలైన హిందీ బిగ్ బాస్ సీజన్ 17(Bigg boss season17)లోకి బాలీవుడ్ కపుల్ అంకితా లోఖండే(Ankitha Lokhade)- విక్కీ జైన్(Vicky Jain) కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. టాస్క్ ల్లో భాగంగా.. ఈ ఇద్దరూ ఎన్నోసార్లు గొడవలు కూడా పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ జంట బయటకు వచ్చాక విడాకులు కూడా తీసుకోనున్నారు అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా అంకిత తన భర్తకు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. అదేంటంటే.. నాకు ఒంట్లో బాలేదు. ఈ నెల పీరియడ్స్ కూడా రాలేదు. ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది.. అని తన భర్త విక్కీకి చెప్పారు. దానికి విక్కీ.. అదేంటి నీకు పీరియడ్స్ వచ్చాయనుకున్నాను..అన్నాడు. అప్పుడు అంకిత.. లేదు.. నన్ను మెడికల్ రూమ్‌కు పిలిచి ప్రెగ్నెన్సీ టెస్ట్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేశారు. కానీ.. రిజల్ట్ ఏంటనేది మాత్రం చెప్పలేదు. చాలా టెన్షన్ గా ఉంది. ఈ ఫీలింగ్ ను మాటల్లో చెప్పలేను. నాకేమీ అర్థం కావడం లేదు.. అని చెప్పారు అంకితా. ఆమె మాటలకు షాకైన విక్కీ మరి నాకెందుకు చెప్పలేదు.. అన్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.