'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'.. ఆసక్తి కలిగేలా ట్రైలర్

'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'..  ఆసక్తి కలిగేలా ట్రైలర్

యూట్యూబ్ లో 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో యూత్ ను బాగా ఆకట్టుకున్నాడు హీరో చైతన్య రావు(Chaitanya Rao). ఇప్పుడు చైతన్య నుంచి రాబోతున్న మరో డిఫరెంట్ చిత్రం "అన్నపూర్ణ ఫొటో స్టూడియో"(Annapurna Photo Studio). తాజాగా ఈ మూవీ నుంచి  ట్రైలర్  రిలీజ్ చేశారు మేకర్స్. 

“నేడే చూడండి మీ అభిమాన థియేటర్​లో అన్నపూర్ణ ఫొటో స్టూడియో. మనస్సుకు హత్తుకునే అందమైన ప్రేమ కథ , గిలిగింతలు పెట్టే హాస్య సన్నివేశాలు, ఉర్రూతలెక్కించే అందమైన పాటలు, ఉత్కంఠ భరితంగా సాగే కథనం, పోరాటలు, ఉహకందని మలుపులు ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని ఉన్నాయి” అంటూ విడుదల చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్​, ప్రోమోలు కూడా ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాగా వస్తున్న ఈ మూవీ పై మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు మేకర్స్. 

గోదావరి ప్రాంతంలో జరిగే ఓ చిన్న లవ్ స్టోరీ, నటీనటుల యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రిన్స్ హేన్రి( Prince Henry)  బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​ కూడా ఆకట్టుకుంటోంది.

హీరో చైతన్య రావుకు జోడీగా నటిస్తున్న హీరోయిన్ లావణ్య(Lavanya)  సహజంగా కనిపిస్తుంది. ఈ మూవీను పెళ్లిచూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్(Big Ben Cinemas) బ్యానర్ దీన్ని నిర్మించింది.ఈ మూవీకు చందు ముద్దు(Chendu Muddu) దర్శకత్వం వహిస్తున్నాడు. జులై 21న ఈ సినిమా విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంతో వస్తున్న ఈ మూవీ  చైతన్యకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.