మాయలేడి’ టీజర్ వచ్చేసింది.. ఫైర్ బ్రాండ్‌గా మధుమిత

మాయలేడి’ టీజర్ వచ్చేసింది.. ఫైర్ బ్రాండ్‌గా మధుమిత

ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి చిత్రాలతో నటుడిగా, ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రూవ్ చేసుకున్న రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మాయలేడి’. ప్రశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.  మధుమిత సర్కార్ హీరోయిన్. తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ప్రేమ, పెళ్లి విషయంలో కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉన్న  క్రిష్‌‌‌‌‌‌‌‌గా రాకేష్ కనిపించగా, ఆశా అనే ఫైర్ బ్రాండ్ పాత్రలో హీరోయిన్ మధుమిత నటించింది.  

ఆమె ఫైట్స్ చేస్తుంది, ఆల్కహాల్ తీసుకుంటుంది. ఆమెను చూసి కుటుంబ సభ్యులు భయపడినా క్రిష్ మాత్రం తననే లవ్ చేస్తాడు. ఈ క్రమంలో ఆశాకు క్రిష్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ గర్ల్‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్ గురించి తెలుస్తుంది. ఈ విషయాన్ని ఎలా డీల్ చేశాడు అనేది ఆసక్తికరంగా టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్ చేశారు. ఇంద్రజ, సురేష్, సత్య ఇతర  కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే డేట్ అనౌన్స్ చేయనున్నారు.