హైదరాబాద్, వెలుగు: బీజేపీ అనుబంధ సంఘాలైన మహిళా మోర్చా, ఎస్సీ మోర్చా, కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీలను ఎట్టకేలకు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆదేశాల మేరకు ఆయా మోర్చాల అధ్యక్షులు, నూతన కార్యవర్గ సభ్యుల జాబితాను విడుదల చేశారు.
25మందితో మహిళా మోర్చా కమిటీ..
మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి తన టీమ్‌ను ప్రకటించారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్లుగా కె. సరిత (నల్గొండ), దాశరథలక్ష్మి (మలక్‌పేట్), మంజుల (వరంగల్), విజయభవాని(మేడ్చల్ అర్బన్), అనిత పమ్మి(ఖమ్మం), కె.సుగుణరెడ్డి (మేడ్చల్ రూరల్) నియమితులయ్యారు. జనరల్ సెక్రటరీలుగా అర్కల సుధ, సాహు శ్రీలత, కార్యదర్శులుగా ఇ.ఉమారెడ్డి, కొత్తపల్లి పద్మ సహా ఆరుగురికి అవకాశం దక్కింది. సోషల్ మీడియా కన్వీనర్‌గా విద్యావతి, ఐటీ కన్వీనర్‌గా డాక్టర్ లావణ్య అంజన్‌ను నియమించారు.
ఎస్సీ మోర్చా టీమ్ ఇదే..
ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ నూతన కమిటీ సభ్యులను వెల్లడించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శివాజీ కాసిపేట (పెద్దపల్లి), ప్రవీణ్ బాగ్డీ (గోల్కొండ), తొండ రవి(రంగారెడ్డి రూరల్), అంకురి నర్సింహ(నల్గొండ), పి.సునీల్ కుమార్ (సికింద్రాబాద్), బోయల వెంకట్ (ఖమ్మం)ఎంపికయ్యారు. జనరల్ సెక్రటరీలుగా దాసి నాగరాజు, ఓరగంటి చంద్రశేఖర్, ట్రెజరర్‌గా శివకుమార్, మీడియా కన్వీనర్‌గా అరవింద్ కుమార్ నియమితులయ్యారు.
అధికార ప్రతినిధులుగా లింగస్వామి, నంది ద్వార్కేష్‌కు చోటు కల్పించారు. మరోవైపు, రైతు విభాగమైన కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బస్వపురం లక్ష్మీనర్సయ్య కార్యవర్గాన్ని ప్రకటించారు. ఐటీ కన్వీనర్‌గా కందాడి సంతోష్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మూడు మోర్చాల్లోనూ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా మరో 15 నుంచి 16 మందికి అవకాశం కల్పించారు.

