
దారుణం.. కన్నబిడ్డల పట్ల తల్లి కఠిన ఉండటమే నేరమా..తప్పుదారి పడుతున్న పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలనుకోవడం పాపమా..! ‘‘చదువుకోరా.. బాగుపడతావు’’ అని తల్లి మందలించింది అంతే.. అదే ఆమెపాలిట శాపమైంది. కన్న కొడుకు చేతిలో దారుణంగా బలైంది. తల్లిపై కోపంతో తమ్ముడిని కూడా చంపేశాడు. చెన్నైలో ఈ దారుణం జరిగింది. అసలేం జరిగిందంటే..
తమిళనాడులోని చెన్నై నగరంలో ఈ దారుణం జరిగింది. తిరువొత్తియూత్తూర్లో ఇంట్లో నిద్రిస్తున్న తల్లిని, తమ్ముడిని ఓ యువకుడు దారుణంగా చంపేశాడు. 20 ఏళ్లు కాలేజీ విద్యార్థి కత్తితో పొడిచి, గొంతు కోసి దారుణంగా తల్లి, తమ్ముడిని హత్యా చేశాడు. వేలాచ్చేరిలోని ఓ కళాశాలలలో బీఎస్సీ చదువుతున్న డేటా ఎనలిస్ట్ విద్యార్థి నితీష్.. హత్య అనంతరం తమ్ముడు, తల్లి మృతదేహాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉంచి వంటగదిలో వదిలి పారిపోయాడు. ఈ వార్తతో చెన్న పట్ణణమంతా ఒక్కసారగి ఉలిక్కి పడింది.
రెండు రోజుల తర్వాత నిందితుడు నితీష్ తన అత్తకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఈ విషయం అందరికి తెలిసింది. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు నితీష్ పంపిన మేసేజ్ చూసిన అత్త మహాలక్ష్మీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇంటికి వెళ్లి చూస్తే ఇంటి నేలపై గోడలపై రక్తం చిమ్మిన మరకలు, కుళ్లిన వాసన.. రెండు ప్లాస్టిక్ బ్యాగుల్లో ఆమె వదిన పద్మ, మేనల్లుడు సంజయ్ మృత దేహాలు చూసి బోరున విలపించింది. ఉద్యోగం పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లిన అన్నకు ఫోన్ చేసి ఈ దారుణాన్ని చెప్పింది.
పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, స్నిఫర్ డాగ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నితీష్ ఫోన్ నంబర్ టవర్ లోకేషేన్ ను ట్రేస్ చేసి అతను తిరువొత్తియుత్తిర్ బీచ్ లో ఉన్నట్లు గుర్తించారు.. నితీష్ ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నితీష్ చెప్పిన విషయాలను విని పోలీసులు షాక్ తిన్నారు. డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో 14 సబ్జెక్టులు ఫేల్ ఉన్నాయని.. తల్లి చదువుకోమని తన తల్లి మందలించేదని చెప్పాడు. తల్లి తన పట్ల స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల చిరాకు తెప్పించదని అందుకే తల్లిని గొంతుకోసి హత్య చేశానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. తమ్ముడి ఎందుకు చంపావు అని పోలీసులు అడిగిన ప్రశ్నకు ..తమ్ముడిని అనాథ అవుతాడని చంపానని నితీష్ చెప్పిన సమాధానం విని మరోసారి షాక్ తిన్నారు.
ఈ హత్యలు చేసిన తర్వాత తాను రైలు కిందపడి లేదా సముద్రంలో దూకి చావాలని అనుకున్నానని.. తర్వాత మనసు మార్చుకున్నాని నితీష్ పోలీసులకు చెప్పాడు. మరుసటి రోజు వార్తాపత్రికలలో సంఘటన గురించి ఎటువంటి వార్త లేకపోవడంతో అతను తన అత్తకు హత్యల గురించి మేసేజ్ పెట్టినట్లు చెప్పాడు.
నితీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చిజైలుకు పంపారు.