
దోహా: వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో ఇండియా జావెలిన్ త్రోవర్ అన్ను రాణి ఫైనల్‌కు దూసుకెళ్లి ఈ ఘనత సాధించిన దేశ తొలి మహిళగా రికార్డు సృష్టించింది. సోమవారం జరిగిన గ్రూప్-–ఎ క్వాలిఫికేషన్స్‌లో జావెలిన్‌ను 62.43 మీటర్లు విసిరిన రాణి తన పేరిట ఉన్న (62.34 మీ) నేషనల్ రికార్డును తిరగరాసింది. తొలి రౌండ్‌లో 57.05 మీటర్లు విసిరిన రాణి.. రెండో రౌండ్‌లో 62.43 మీటర్లు, మూడో రౌండ్‌లో 60.50 మీటర్లు విసిరింది. గ్రూప్–ఎలో మూడో స్థానంలో నిలిచిన అన్ను.. ఓవరాల్ క్వాలిఫికేషన్‌లో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. మంగళవారం జరిగే ఫైనల్ రౌండ్‌కు క్వాలిఫై అయింది. క్వాలిఫికేషన్ మార్క్ 63.50 మీటర్లను అందుకున్న చైనా అథ్లెట్, ఆసియా చాంపియన్ లియు హుయిహుయి(67.27 మీ), స్లోవెనియా ప్లేయర్ రటేజ్ మార్టినా( 65.29) నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫికేషన్‌లో అర్హత సాధించిన అన్ను రాణితో పాటు మరో పదిమంది ఫైనల్లో పోటీపడనున్నారు. కాగా, ఈ టోర్నీలో అర్చన సుశీంద్రన్, అంజలీదేవి తీవ్రంగా నిరాశపరిచారు. 200, 400 మీటర్ల పోటీల్లో తొలి రౌండ్‌నే దాటలేకపోయారు. చివరి నిమిషంలో టోర్నీకి ఎంపికైన అర్చన 100 మీటర్లు హీట్–2 రేస్‌లో తన బెస్ట్ టైమింగ్(23.18)ను కూడా అందుకోలేకపోయింది. 23.65 సెకండ్లలో రేస్‌ను పూర్తి చేసి 40వ స్థానంలో నిలిచింది. 200 మీటర్ల హీట్–6 రేస్‌లో అంజలి కూడా తన బెస్ట్ టైమింగ్ (51.53)ను అందుకోలేకపోయింది. 52.33 సెకండ్లలో రేస్‌ను పూర్తి చేసి 36వ స్థానంలో నిలిచింది.