వచ్చే ఏడాది జనవరి నాటికి 10వేలకు పెంచుతం

వచ్చే ఏడాది జనవరి నాటికి 10వేలకు పెంచుతం

ప్రకటించిన సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్  

శాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాన్సిస్కో : తమకు ప్రస్తుతం మనదేశంలో 7,500 మందికి పైగా ఉద్యోగులు ఉండగా, వీరి సంఖ్యను వచ్చే ఏడాది జనవరి నాటికి 10వేలకు పెంచుతామని యూఎస్​ కంపెనీ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్​ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్  సీఈఓ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. భారతదేశంలో తాము బ్యాంకింగ్, ఆర్థిక సేవలు,  బీమాతోపాటు తయారీ,  సామాజిక సేవలపై ఫోకస్​ చేస్తున్నామని అన్నారు.  క్లౌడ్ ఆధారిత సేవలు అందించే ఈ కంపెనీకి ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పూణె, గురుగ్రామ్  జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్యాలయాలు ఉన్నాయి.  సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ తన ఉద్యోగుల సంఖ్యను  2020 ఏప్రిల్లో 2,500 నుంచి 7,500కి పెంచుకుంది.

మహమ్మారి అనంతర ఫ్లెక్సిబుల్  హైబ్రిడ్ వర్క్ కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ,  ఇక నుంచి మరింత మంది వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ ఆఫీసులకు వస్తారని అన్నారు. వర్క్​ ఫ్రం హోం విధానాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేమని అన్నారు. తగినంత ఖాళీ స్థలం లేకపోవడం వల్ల చాలా మందికి ఇంటి నుంచి పని చేయడం కొంచెం కష్టమని ఆమె చెప్పారు. భారతీయ యువత నేర్చుకోవలసిన తదుపరి స్కిల్స్​ గురించి అడిగిన ప్రశ్నకు, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సేవ (సాఫ్ట్​వేర్​ యాజ్​ సర్వీస్​)గా అందించే కంపెనీలు,  క్లౌడ్ ఆధారిత కంపెనీలు ఉపయోగించే టెక్నాలజీలను వారు నేర్చుకోవాలని ఆమె సూచించారు.