తిరుమల నడక మార్గంలో మరో చిరుత

తిరుమల నడక మార్గంలో మరో చిరుత

తిరుమల నడక మార్గంలో మరో చిరుతను బుధవారం ( సెప్టెంబర్ 6)  సంచరిస్తున్నట్లు కెమెరాల్లో సిబ్బంది గుర్తించారు. . శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారాన్ని గుర్తించారు. దీంతో తిరుమల కాలినడక దారి భక్తులను టీటీడీ అలెర్ట్ చేసింది.   యాభై రోజుల వ్యవధిలో ఐదు చిరుతల్ని టీటీడీ అధికారులు బంధించారు. చిరుతల సంచారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వాటిని కట్టడి చేయడంపై టీటీడీ దృష్టి సారించింది. చిరుతల సంచరాన్ని నిరోధించేందుకు  టీటీడీ చర్యలు చేపట్టింది.  ఇప్పటికే తిరుమల కాలినడక మార్గంలో చిరుతను బంధించేందుకు  బోన్లు ఏర్పాటు చేశారు. చిరుత బోనులో చిక్కుకునే ప్రాంతాలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే  నడకదారిలో వన్యమృగాలు సంచరించడంతో భక్తులు  అలిపిరి మార్గంలో భక్తులు తగ్గినట్లు తెలుస్తోంది.