తిరుమల ట్రాప్ బోనులో చిక్కిన మరో చిరుత

తిరుమల ట్రాప్ బోనులో చిక్కిన మరో చిరుత

తిరుమల నడకదారిలో మరో చిరుత బోనులో చిక్కింది. గత వారం రోజులుగా చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల లక్షిత అనే చిన్నారిపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా ఓ చిరుత బోనులో చిక్కింది. అనంతరం ఆ చిరుతను అటవీశాఖ జూపార్క్ కు తరలించింది.

లక్ష్మీ నరసింహ ఆలయం 2850మెట్టు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుత చిక్కింది. తాజాగా చిక్కిన చిరుతతో ఇప్పటివరకు బందీ అయిన చిరుతల సంఖ్య 6కు చేరుకుంది. ఇటీవలే చిన్నారి లక్షితను పులి చంపిన ఘటనతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు చోట్ల ట్రాప్ బోన్లు వేసి పులులను పట్టుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా మ్యాన్ ఈటర్ పులులేమైనా ఉంటే వాటిని వెంటనే జూకు తరలించే ప్రయత్నిస్తున్నారు.