ములుగు జిల్లాలో మరో రైతు ఆత్మహత్య

V6 Velugu Posted on Dec 01, 2021

ములుగు జిల్లా: ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామానికి చెందిన రైతు కుమార్ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ధాన్యం రాశి దగ్గరే పురుగుల మందుతాగి చనిపోయాడు. ఏడు ఎకరాల్లో వరి సాగు చేశాడు రైతు కుమార్ . రెండు ఎకరాల్లో పంట కోసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. మరో ఐదు ఎకరాలల్లో వరి కోతకు సిద్ధంగా ఉంది. అయితే వడ్లు అమ్ముడు పోకపోవడంతో చేతిలో డబ్బులు లేక పురుగుల మందు తాగాడు కుమార్. కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లేలోపే మృతి చెందాడు.

Tagged farmer, Mulugu District, suicide,

Latest Videos

Subscribe Now

More News