హైడ్రాకు మరో రూ. 69 కోట్లు విడుదల

హైడ్రాకు మరో రూ. 69 కోట్లు విడుదల

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రాకు మరో రూ. 69 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో నం. 595ను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేట్ బడ్జెట్ లో రూ. వంద కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పటికే మొదటి త్రైమాసికంలో రూ.20 కోట్లు విడుదల చేసింది. తాజాగా హైడ్రాకు మరో రూ. 69 కోట్లను విడుదల చేస్తూ ఆదేశాలు  జారీ చేసింది.