
శివసేన (యూబీటీ) అగ్రనేత ఉద్ధవ్ థాక్రేకు మరో ఎదురుదెబ్బ ఎదురైంది. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్‌పర్సన్ డాక్టర్ నీలం గోర్హే ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గాన్ని (యూబీటీ) విడిచిపెట్టి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఈ సందర్భంగా గోర్హే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నాయకత్వాన్ని ప్రశంసించారు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం షిండే కృషి చేస్తున్నందున ఆమె శివసేనలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.
ఉద్ధవ్ థాకరేను విడిచిపెట్టి, ఏకనాథ్ షిండేతో చేరిన మూడవ ఎమ్మెల్సీ
మనీషా కయాండే, విప్లవ్ బజారియా తర్వాత శివసేనలో చేరిన మూడో ఎమ్మెల్సీ నీలం గోర్హే. ఆమె సీఎం ఏక్‌నాథ్ షిండే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో శివసేనలో చేరారు. సీఎం ఏక్‌నాథ్ షిండే.. గోర్హేను కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.