నీట్ భయంతో మరో స్టూడెంట్ సూసైడ్

నీట్ భయంతో మరో స్టూడెంట్ సూసైడ్
  • కోయంబత్తూర్​లో విషాదం

కోయంబత్తూర్: నేషనల్ ఎలిజిబిలిటీ- కమ్ -ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) లో క్వాలిఫై కానేమోననే భయంతో తమిళనాడులో మరో స్టూడెంట్ ప్రాణం తీసుకున్నాడు. ఇప్పటికే రెండు సార్లు ఎగ్జామ్ రాసిన కోయంబత్తూర్ జిల్లా సంగరాయపురానికి చెందిన కీర్తివాసన్(20) మూడోసారి సెప్టెంబర్​లో జరిగిన నీట్​కు అటెండ్ అయ్యాడు. అయితే, రెండ్రోజుల్లో ఫలితాలు రానున్నందున తాను ఈసారి కూడా క్వాలిఫై కానేమోననే ఆందోళనతో శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా.. ట్రీట్​మెంట్ పొందుతూ అదే రాత్రి చనిపోయాడని పోలీసులు తెలిపారు. తాను ఈసారి కూడా క్వాలిఫై కానేమోనని కీర్తివాసన్ అంత కుముందు రోజే తల్లిదండ్రుల ఎదుట ఆందోళన చెందాడని, వాళ్లు సర్దిచెప్పి నప్పటికీ అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పారు. కాగా, పోయిన సెప్టెంబర్​12న నీట్ జరిగిన ఐదు రోజుల వ్యవధిలోనే తమిళనాడులో ముగ్గురు స్టూడెంట్లు ప్రాణాలు తీసుకున్నారు. డీఎంకే ప్రభుత్వం కూడా రాష్ట్రంలో నీట్​ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.