కరోనాకు హెటిరో నుంచి మరో ట్యాబ్లెట్ ఫవివిర్

కరోనాకు హెటిరో నుంచి మరో ట్యాబ్లెట్ ఫవివిర్

 డీసీజీఐ పర్మిషన్

ఒక్కో ట్యాబ్లెట్ రేటు రూ.59

హైదరాబాద్, వెలుగు: తక్కువ స్థాయి తీవ్రత ఉన్న కరోనా రోగుల కోసం హెటిరో ల్యాబ్స్ తన ఫవిపిరవిర్ జెనరిక్ ట్యాబ్లెట్లను లాంచ్ చేసింది. వీటిని ‘‘ఫవివిర’ పేరుతో అమ్ముతుంది. ఫవిఫిరవిర్ తయారీ, మార్కెటింగ్ కోసం హెటిరోకు డ్రగ్ కంటోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. కోవిడ్–19 బాధితుల కోసం ఇది వరకే కోవిఫర్ (రెమిడెసివర్)ను హెటిరో డెవలప్ చేయడం తెలిసిందే. ఫవివిర్ రెండో డ్రగ్.

నోటి ద్వారా తీసుకునే యాంటీ వైరల్ ట్యాబ్లెట్ ఇది. ఈ ట్యాబ్లెట్లపై నిర్వహించిన క్లినికల్ ప్రయోగాల్లో ఆశించిన రిజల్ట్స్ వచ్చాయని కంపెనీ వెల్లడించింది. హెటిరో ఫవివిర్ ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.5 ఉంటుంది. దేశ వ్యాప్తంగా అన్ని మందుల దుకాణాల్లో, ఆస్పత్రులలోని ఫార్మశీల్లో బుధవారం నుంచే ఈ ట్యాబ్లెట్లు అందుబాటులోకి వచ్చాయి.