కాంగ్రెస్‌ హామీలన్నీ నెరవేరిస్తే నేను కూడా రాజీనామా చేస్త : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్‌ హామీలన్నీ నెరవేరిస్తే నేను కూడా రాజీనామా చేస్త :  ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్‌ హామీలన్నీ నెరవేరిస్తే.. రాజీనామా చేసేందుకు తాను కూడా సిద్ధమని బీజేపీ శాసనసభపక్ష నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. నాంపల్లిలోని మీడియా సమావేశంలో  ఆయన మాట్లాడారు.  కేవలం రుణమాఫీ పైనే సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసురుతున్నారని...మిగతా హామీల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.  కాంగ్రెస్ ఎన్నికల్లో  ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే.. రాజీనామా చేసేందుకు తాను కూడా సిద్ధమేనన్నారు. 

కాగా  రైతు రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను ఆగస్టు 15లోగా అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్​ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తనకు రాజకీయాలకంటే పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. ఐదేండ్లు తాను పదవిలో లేకపోయినా పర్వాలేదన్నారు. 

Also Read:ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా

అయితే హరీష్ విసిరిన సవాల్ కు సీఎం రేవంత్ స్పందించారు.   రైతులకు రుణమాఫీ చేయకపోతే తమకు ఈ అధికారం ఎందుకన్నారు.  తామున్నదే రైతుల కోసమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇచ్చిన మాట తప్పేది లేదని, పంద్రాగస్టు లోగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతానని తెలిపారు.