భారీగా పడ్డ మార్కెట్లు .. సెన్సెక్స్​ 600 పాయింట్లు డౌన్​

భారీగా పడ్డ మార్కెట్లు .. సెన్సెక్స్​ 600 పాయింట్లు డౌన్​
  • 150  పాయింట్లు తగ్గిన నిఫ్టీ

ముంబై: ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ధోరణుల మధ్య పెట్టుబడిదారులు బ్యాంకింగ్, ఫైనాన్షియల్,  కన్స్యూమర్ డ్యూరబుల్ స్టాక్‌‌‌‌‌‌‌‌లను భారీగా అమ్మడంతో ఐదు రోజుల ర్యాలీ తర్వాత శుక్రవారం సెన్సెక్స్ , నిఫ్టీలు నష్టపోయాయి. అమ్మకాల ఒత్తిడికితోడు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి విలువ క్షీణించడం, విదేశీ నిధుల తరలింపు సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌పై మరింత ప్రభావం చూపాయి. 

సెన్సెక్స్ 609.28 పాయింట్లు తగ్గి 73,730.16 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 722.79 పాయింట్లు కోల్పోయి 73,616.65 వద్దకు చేరుకుంది. ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 150.40 పాయింట్లు పడి 22,419.95 వద్దకు చేరుకుంది.  "జపనీస్ కరెన్సీ యెన్ కొత్త 34 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. యూఎస్​ జీడీపీ డేటా నిరాశపర్చింది. బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ దిగుబడులు 4.7 శాతానికి పైగా పెరిగాయి. కరెక్షన్​కు ఇవన్నీ కారణమని చెప్పవచ్చు. మీడియం టర్మ్‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేటు తగ్గింపు ఆశలు మరింత దిగజారుతున్నాయి" అని మెహతా ఈక్విటీస్​కు చెందిన ప్రశాంత్ తాప్సే చెప్పారు. 

సెన్సెక్స్​కంపెనీల నష్టాల బాట

సెన్సెక్స్ చార్ట్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం బజాజ్ ఫైనాన్స్ టాప్​లూజర్​గా నిలిచింది. కంపెనీ మార్చి త్రైమాసిక ఆదాయాలు పెట్టుబడిదారులను నిరుత్సాహపరచడంతో  దాదాపు 8 శాతం పడిపోయింది. బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్ కూడా 3 శాతంపైగా క్షీణించింది. ఇండస్‌‌‌‌‌‌‌‌ఇండ్ బ్యాంక్, నెస్లే, కోటక్ మహీంద్రా బ్యాంక్  మహీంద్రా   షేర్లు నష్టపోయాయి.   ఫలితాలు బాగుండటంతో టెక్ మహీంద్రా 7 శాతానికి పైగా దూసుకెళ్లింది.

 విప్రో, ఐటీసీ, అల్ట్రాటెక్ , టైటాన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 0.83 శాతం, స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం పెరిగింది. సూచీలలో బ్యాంకెక్స్ 0.70 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.68 శాతం, టెక్ 0.26 శాతం, ఆటో 0.25 శాతం, టెలికమ్యూనికేషన్ 0.15 శాతం క్షీణించాయి. ఎనర్జీ, హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్, సర్వీసెస్  పవర్ లాభపడిన వాటిలో ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై,  హాంకాంగ్ సానుకూలంగా ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు గ్రీన్‌‌‌‌‌‌‌‌లో ట్రేడవుతున్నాయి.