ఈ మేనిఫెస్టో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వరం... బొత్స

ఈ మేనిఫెస్టో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వరం... బొత్స

కొత్త పథకాలేవి లేకుండా, ఉన్న వాటికే నగదును పెంచుతూ 2024 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు జగన్. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99శాతం అమలు చేశామని, ఇప్పుడు కూడా అదే నిజాయితీతో విశ్వసనీయతతో మేనిఫెస్టో రూపొందించామని అన్నారు జగన్. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మేనిఫెస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేనిఫెస్టో జగన్ నిజాయితీకి, విశ్వసనీయతకు నిదర్శనం అని అన్నారు. 25వేలు జీతం తీసుకుంటున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంక్షేమ పథకాలు అమలయ్యేలా ఆదాయ పరిమితి పెంచటం జగన్ మంచి మనసుకు నిదర్శనం అని అన్నారు.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99శాతం అమలు చేసిన ఘనత జగన్ ది అని, 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని చరిత్ర చంద్రబాబుది అని అన్నారు. 2014 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన ముగ్గురూ ఇప్పుడు మళ్ళీ కూటమిగా వస్తున్నారని, వారిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు బొత్స. 

Also Read:నడిచే నమ్మకం జగన్.. దగాకు ప్రతిరూపం చంద్రబాబు కూటమి.. పేర్ని నాని