ఐటీ కంపెనీలకు కునుకులేకుండా చేస్తున్న Anthropic ఏఐ టూల్.. Infosys, TCS స్టాక్స్ క్రాష్..

ఐటీ కంపెనీలకు కునుకులేకుండా చేస్తున్న Anthropic ఏఐ టూల్.. Infosys, TCS స్టాక్స్ క్రాష్..

ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టూల్స్ రోజురోజుకూ తమ అత్యాధునిక, మానవుల ఊహలకే కాదు దిగ్గజ కంపెనీల మైండ్ కి కూడా అర్థం కానంత వేగంగా మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో దశాబ్ధాలుగా టెక్నాలజీ రంగంలో ఉన్న కంపెనీలు కూడా తమ మనుగడపై ఆందోళన చెందుతున్నాయి. ఈ మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీల షేర్లు మాత్రమే కాకుండా భారతీయ కంపెనీలైన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ సహా మరిన్ని కంపెనీల షేర్లు పతనం అవుతున్నాయి. బుధవారం ఇంట్రాడేలో నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 6 శాతం పతనాన్ని నమోదు చేయటంతో ఇన్వెస్టర్లలోనే కాకుండా ఈ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ALSO READ : ఒక్కరోజే కేజీకి రూ.40వేలు పెరిగిన వెండి..

ఐటీ రంగంలో ఒక్కసారిగా మొదలైన కుదుపు మదుపర్లను ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్నాళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ కంపెనీలకు భారీ లాభాలు వస్తాయని భావించిన వారందరికీ.. ఇప్పుడు అదే AI కొత్త సవాళ్లను విసురుతోంది. ముఖ్యంగా ఆంత్రోపిక్(Anthropic) సంస్థ తన క్లాడ్(Claude) చాట్‌బాట్ కోసం కొత్తగా ప్రవేశపెట్టిన లీగల్ టూల్ సాఫ్ట్‌వేర్ రంగంలో పెను సంచలనానికి తెరలేపింది. ఈ టూల్ లీగల్.. సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్ వంటి పనులను ఆటోమేట్ చేయగలగడం ఐటీ సేవల కంపెనీల మనుగడపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ALSO READ : హెలికాప్టర్ల తయారీకి లియోనార్డోతో అదానీ జట్టు

ఈ పరిణామాల నేపథ్యంలో వాల్ స్ట్రీట్‌లో టెక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ప్రముఖ ఏఐ దిగ్గజాలు ఎన్విడియా , మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 3 శాతం పడిపోగా.. సేల్స్‌ఫోర్స్, అడోబ్ వంటి సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు ఏకంగా 7 శాతం వరకు నష్టపోయాయి. గతంలో ఏఐ వల్ల ఈ కంపెనీలు ప్రయోజనం పొందుతాయని నిపుణులు భావించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా తలకిందులు అవుతున్నాయి. కానీ క్లాడ్ వంటి ఏజెంట్లు నేరుగా క్లిష్టమైన పనులను పూర్తి చేసేస్తుండటంతో.. సంప్రదాయ సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీలకు పోటీ పెరిగిపోతుందనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. దీని ప్రభావంతో అమెరికా మార్కెట్ సూచీ నాస్డాక్ 1.43 శాతం క్షీణించింది.

ALSO READ : అమెరికా సుంకాల తగ్గింపుతో ఎగుమతులకు బూస్ట్..

అమెరికా మార్కెట్లలో ఐటీ షేర్ల అమ్మకాలు.. ప్రస్తుతం భారతీయ ఐటీ రంగంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. భారత ఐటీ కంపెనీల వాల్యుయేషన్లు ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో ఉన్నాయని, ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్న ఈ సంకేతాలు భారత మార్కెట్ ర్యాలీకి బ్రేకులు వేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐటీ రంగంలో వస్తున్న ఈ అనూహ్య మార్పులు కేవలం కంపెనీల లాభాలనే కాకుండా.. టెక్ సర్వీస్ ఇండస్ట్రీకి కూడా సమూలంగా మార్చేసేలా కనిపిస్తున్నాయి. ఏఐ అనేది ఒక అవకాశంగా మాత్రమే కాకుండా, ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్ సామ్రాజ్యాలకు ఒక విఘాతంగా మారుతుండటం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.