ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటిజెన్ టెస్ట్‌లు ప్రారంభం

ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటిజెన్ టెస్ట్‌లు ప్రారంభం

రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం కే‌సుల సంఖ్యకు తగ్గట్టుగా కోవిడ్ పరీక్షలు చేయడం కోసం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ టెస్టులు బుధ‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. జిహెచ్ఎమ్‌సీ ప‌రిధిలోని 50 సెంటర్స్ ల‌లో, రంగారెడ్డి లో 20 సెంటర్స్, మేడ్చల్ లో 20 సెంటర్స్ ల‌లో ఈ టెస్ట్‌లు ప్రారంభ‌మ‌య్యాయి.

ఒక్కో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో (అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్) మ్యాక్సీమం 25 శాంపిల్స్ తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. క‌రో‌నా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి, కాంటాక్ట్ హిస్టరీ ఉన్నవారికి టెస్ట్ లు చేయాల‌ని తెలిపారు. 30 నిమిషాలలోనే ఈ టెస్ట్‌ల‌కి సంబంధించి రిజల్ట్ కావడం తో కరోనా అనుమానితులు ముందు త‌మ‌కే చెయ్యండ‌ని ముందుకు వస్తుండ‌డంతో ఎవరిని సెలెక్ట్ చెయ్యాలో హెల్త్ సిబ్బందికి అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. 15 నుంచి 30 నిమిషాలలో రిపోర్ట్ రాక‌పోతే ఈ టెస్ట్ లో‌ ఫాల్స్ రిజల్ట్ గా పరిగణిస్తారు.