Kiccha Sudeep BRB: కిచ్చా సుదీప్ కొత్త సినిమా అనౌన్స్..టైటిల్ కాన్సెప్ట్ వీడియో అదుర్స్

Kiccha Sudeep BRB: కిచ్చా సుదీప్ కొత్త సినిమా అనౌన్స్..టైటిల్ కాన్సెప్ట్ వీడియో అదుర్స్

ఎటువంటి పాత్రకైనా పర్‌‌ఫెక్ట్ అనిపించుకోగల సత్తా కొందరికే ఉంటుంది. అలాంటి నటుడే కిచ్చా సుదీప్ (Kiccha Sudeep). కన్నడలో ఆయన స్టార్ హీరో. తెలుగువారికి ఆయనో బెస్ట్ విలన్. బాలీవుడ్ వారికి బెస్ట్ యాక్టర్. మొత్తంగా అందరికీ ఆయన ఫేవరేట్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో తన నటనకు తెలుగు ప్రేక్షకులే కాదు ఇండియా వైడ్గా ఫిదా అయ్యారు. ఇవాళ సుదీప్ 53వ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. 

దర్శకుడు అనూప్ భండారి (Anup Bhandari) డైరెక్షన్లో ‘విక్రాంత్ రోనా’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత..సుదీప్ ఆయనతో కలిసి మరోమూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాకు 'బిల్లా రంగా బాషా' (BRB) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాని హనుమాన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై (Primeshow Entertainment) కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించనున్నారు.

ఈ నేపథ్యంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ .."సెన్సేషనల్ విక్రాంత్ రోనా కాంబో, బాద్‌షాతో గర్వంగా చేతులు కలుపుతున్నాను..'ఎ టేల్ ఫ్రమ్ ది ఫ్యూచర్' తీసుకురావడానికి మా తదుపరి పాన్ ఇండియన్ ఫిల్మ్ రాబోతుంది" అంటూ టైటిల్ పోస్టర్ & కాన్సెప్ట్ వీడియో పోస్ట్ చేశారు. 

ALSO READ | TheGOAT: విజయ్ ది గోట్ అప్డేట్..హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

కాన్సెప్ట్ వీడియోలో క్రీ.శ. 2209లో జరిగిన భవిష్యత్తు గురించిన ఒక సంగ్రహావలోకనం, ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్ మరియు తాజ్ మహల్ అన్నీ ధ్వంసమయ్యాయి. అలాగే ఒక వ్యక్తి అన్నింటినీ జయించినట్లు కనిపిస్తోంది. దీనికి మూడు వేర్వేరు ప్రాంతాలు మరియు జాతులు, వాతావరణాన్ని చూపించాడు దర్శకుడు.

కథలోని థీమ్ ఆడియెన్స్ కు అర్ధం అయ్యేలా రూపొందించాడు డైరెక్టర్ అనూప్ భండారి. బిల్లా రంగా బాషా మూవీ కాన్సెప్ట్ వీడియోతో అంచనాలు పెంచేసిన టీమ్..త్వరలోనే భారీ స్థాయిలో షూటింగ్‌ షురూ చేయనున్నారు.