అక్టోపస్‌‌ మూవీలో లీడ్‌‌ రోల్లో అనుపమ

అక్టోపస్‌‌ మూవీలో  లీడ్‌‌ రోల్లో అనుపమ

గ్లామర్ రోల్స్‌‌తో పాటు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌‌తోనూ మెప్పిస్తోంది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. జనవరిలో ‘ఈగిల్’, ఫిబ్రవరిలో ‘సైరన్’ చిత్రాలతో ఆడియెన్స్‌‌ను పలకరించిన అనుపమ.. ఈ నెలాఖరుకు  ‘టిల్లు స్క్వేర్‌‌‌‌’ మూవీతో అలరించడానికి రెడీ అవుతోంది. మరోవైపు దర్శకులు  ప్రవీణ్ కాండ్రేగుల, మారి సెల్వరాజ్‌‌తో సినిమాలు చేస్తోంది. వీటితోపాటు తనకు  ఇంకా వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. 

తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టులో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌‌గా  ‘హనుమాన్‌‌’ చిత్రంతో  బ్లాక్‌‌బస్టర్‌‌ అందుకున్న ప్రశాంత్‌‌ వర్మ డైరెక్షన్‌‌లో అనుపమ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.  ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ‘అక్టోపస్‌‌’ మూవీలో  అనుపమ లీడ్‌‌గా చేయడానికి ఓకే చెప్పిందట.  ఇలా వరుస అవకాశాలతో అనుపమ పరమేశ్వరన్‌‌ కెరీర్‌‌ అన్‌‌స్టాపబుల్‌‌గా సాగుతోంది. తను కూడా ఒకే తరహా పాత్రలు కాకుండా డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది.