
జనవరిలో ‘ఈగల్’, ఫిబ్రవరిలో ‘సైరన్’, మార్చిలో ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు మరింత స్పీడ్ పెంచింది. ‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా గ్లామరస్ రోల్‌తో మెస్మరైజ్ చేసిన అనుపమ.. ఇప్పుడు సీరియస్ క్యారెక్టర్‌లో కనిపించబోతోంది. మలయాళంలో రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆమె నటిస్తున్న చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు సురేష్ గోపీ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడే జానకి పాత్రలో అనుపమ కనిపించబోతుండగా ఆమె తరఫున కేసును వాదించే లాయర్‌గా సురేష్ గోపీ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, తాజాగా డబ్బింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసినట్టు అనుపమ సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ ఇచ్చింది. ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగులో విడుదల చేయనున్నారు. మరోవైపు దర్శకులు ప్రవీణ్ కాండ్రేగుల, మారి సెల్వరాజ్‌తో పాటు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లోని ‘అక్టోపస్’ మూవీలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.