
కెరీర్ ను షారుఖ్ లాంటి స్టార్ హీరోతో స్టార్ట్ చేసింది అనుష్కాశర్మ. ఆతర్వాత వెనక్కి తిరిగిచూసుకోలేదు.కానీ ఏమయ్యిందోఏమో.. ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది. విరాట్ కోహ్లీని పెళ్లాడాక సినిమాలతో పాటు క్లాత్ బిజినెస్ మొదలు పెట్టి మరింత బిజీ అయ్యింది. కానీ చేయాల్సిన సినిమాలైతే చేయట్లేదు. దాంతో ఆమె పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటోంది, అందుకే ఈ గ్యాప్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిని చూస్తూనే రయ్యిన లేచింది అనుష్క.‘’నేనేమీ డబ్బులు సంపాదించడానికి సినిమాల్లోకి రాలేదు.నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి వచ్చాను. అందుకే నాకు నచ్చిన కథలు మాత్రమే చేస్తాను. కథ నచ్చితే నటించడానికే కాదు, నిర్మించడానికి కూడా నేను రెడీ. ఏ సినిమా చేయట్లేదు అంటే ఏ కథా నచ్చలేదని, పిల్లల్ని కంటున్నానని కాదు. అయినా పిల్లల్ని ఎప్పుడు కనాలో నాకు తెలుసు. నా పర్సనల్ విషయాల్లో ఇతరుల జోక్యం అవసరం లేదు’అంటూ చిటపటలాడిపోయింది. అదీ నిజమే. అది ఆమెవ్యక్తిగత విషయం కనుక కల్పించుకోవడం తప్పే. కానీ మంచి డిమాండ్ ఉన్న సమయంలో ఇలా చేస్తే రేపుచాన్సు లు ఎలా వస్తాయి . అది అనుష్క ఎందుకు ఆలోచించట్లేదో..