
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఘాటి'. ఎన్నో అంచనాలతో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ నెల సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. దీంతో విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.
నిరాశ పరిచిన క్రిష్ మేకింగ్
కథా నేపథ్యం, కథనం చాలా బలంగా ఉన్నప్పటికీ.. క్రిష్ జాగర్లమూడి దానిని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరపై చూపించడంలో విఫలమయ్యాడని విమర్శకులు వచ్చాయి. ఈ 'ఘాటి' చిత్రాన్ని సుమారు 50 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించినట్టు తెలుస్తోంది. అయితే, తొలిరోజు నుంచే కలెక్షన్లు తగ్గడంతో, దేశవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రూ 7 కోట్ల నిక) వసూళ్లను మాత్రమే రాబట్టగలిగిందని సమాచారం.
'ఘాటి' స్ట్రీమింగ్ ఎప్పుడు?
సాధారణంగా, ఓ పెద్ద సినిమా ఓటీటీలోకి రావడానికి 8 వారాల సమయం తీసుకుంటుంది. కానీ, 'ఘాటి' ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, నిర్మాతలు విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించారు. 'ఘాటి' సినిమా సెప్టెంబర్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
►ALSO READ | Junior OTT: అఫీషియల్.. ఓటీటీలోకి శ్రీలీల, కిరీటి ‘జూనియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కథేంటి?
ఈ చిత్రంలో అనుష్క శీలావతిగా, విక్రమ్ ప్రభు (దేశిరాజు) ముఖ్య పాత్రల్లో నటించారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని దట్టమైన తూర్పు కనుమల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆ ప్రాంతంలో మాత్రమే పండే ఖరీదైన గంజాయి పంటను కోసి, బయటకు తీసుకొచ్చే పనిని 'ఘాటీ'లు చేస్తుంటారు. రూపంలో సాఫ్ట్‌గా కనిపించినా, లోపల రగిలే అగ్నిపర్వతం వంటి పాత్రలో అనుష్క అద్భుతంగా నటించింది. తమ ప్రాంత ప్రజలను, ముఖ్యంగా ఘాటీలను డ్రగ్స్ మాఫియా నాయకులైన కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), అతని తమ్ముడు కుందుల నాయుడు (చైతన్య రావు) ఎంతలా దోచుకుంటున్నారు, వేధిస్తున్నారు అనేది ప్రధాన కథాంశం. ఈ దోపిడీ నుంచి ప్రజలను విముక్తం చేయడానికి, తమ ప్రేమకు అడ్డుగా నిలిచిన నాయుడు సోదరులపై ప్రతీకారం తీర్చుకోవడానికి శీలావతి, దేశిరాజు కలిసి చేసిన పోరాటమే ఈ సినిమా.
జాతీయ అవార్డు గ్రహీత తోట తరణి అందించిన కళా దర్శకత్వం, మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీ, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సాంకేతికంగా చిత్రానికి బలం చేకూర్చినా, బలహీనమైన స్క్రీన్‌ప్లే కారణంగా సినిమా ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. 'ఘాటి'ని థియేటర్‌లో చూడలేని వారు, ఈనెల 26 నుంచి ప్రైమ్ వీడియోలో తమ ఇంటిల్లిపాదితో హాయిగా వీక్షించే అవకాశం లభించింది.