
కర్ణాటక మాజీ మంత్రి, గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి, శ్రీలీల నటించిన రీసెంట్ మూవీ జూనియర్ (Junior). జులై 18న థియేటర్లలో రిలీజైన జూనియర్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. సాంగ్స్తో భారీ హైప్ ఇచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. శ్రీలీలతో పాటు జెనీలియా రీఎంట్రీ బాగుందని రివ్యూలు వచ్చినప్పటికీ.. కలెక్షన్లలో మాత్రం రాణించలేకపోయింది.
ఈ క్రమంలో మూవీ థియేటర్లలో రిలీజైన సుమారు రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఇవాళ (సెప్టెంబర్ 24న) జూనియర్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చింది. మంగళవారం (సెప్టెంబర్ 30) నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది.
“సీనియర్కి సెమిస్టర్ ఎగ్జామ్ ఉందని జూనియర్ 30కి వస్తున్నాడు. జూనియర్ మూవీ సెప్టెంబర్ 30న స్ట్రీమింగ్” అనే క్యాప్షన్తో ఆహా వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే, జూనియర్ ఓటీటీపై ఇన్నిరోజులు రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మొదట ప్రైమ్లో ఆగస్ట్ 2 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు దసరా స్పెషల్గా శ్రీలీల జూనియర్తో ఓటీటీ ఫ్యాన్స్కి కనువిందు చేయనుంది.
జూనియర్ బడ్జెట్ & కలెక్షన్లు:
జూనియర్ మూవీ ప్రమోషన్ ఖర్చుతో కలిపి మొత్తం రూ. 25 కోట్ల బడ్జెట్తో నిర్మించబడింది. శ్రీలీల, కిరిటీ క్రేజీ దృష్ట్యా రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. దానికితోడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1100 స్క్రీన్లలో విడుదలైంది. ఆంధ్రప్రదేశ్/తెలంగాణలో 500 స్క్రీన్లలో, ఇండియా వైడ్ గా 900 స్క్రీన్లలో మరియు ఓవర్సీస్లో 200 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజయ్యింది. ఈ క్రమంలోనే భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు. కానీ, సినిమా మిక్సెడ్ టాక్ అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లకి పైగా గ్రాస్, ఇండియాలో రూ.7 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసినట్లు సమాచారం.
►ALSO READ | బిగ్గెస్ట్ టాప్ ఓపెనింగ్స్ దిశగా OG.. పుష్ప 2 బ్రేక్ చేసి RRRకి దగ్గరగా.. తొలి రోజే రూ.150 కోట్లు ఖాయమా?
జూనియర్ మూవీ “ఫాదర్- సన్, బ్రదర్-సిస్టర్, ఫాదర్-డాటర్” అంశాలతో కథ రాసుకున్నాడు డైరెక్టర్ రాధాకృష్ణ. సినిమాచూసే కొద్దీ.. స్టోరీ రోటీన్ అనిపించినప్పటికీ.. కామెడీ, ఎమోషన్, యాక్షన్, లవ్ ట్రాక్ వర్కౌట్ అయ్యాయి. ఆడియన్స్ను ఎక్కడా బోర్ కొట్టకుండా చేశాయి. ఫస్టాఫ్ మొత్తం హీరో హుషారైన డాన్స్, హీరోయిన్తో లవ్ ట్రాక్, సత్య, హర్షతో కామెడీ వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి. సెకండాఫ్లో ఎమోషన్ చూపించాడు.