- అదుపు చేసిన ఫైర్ ఫైటర్స్
జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ఓ పబ్‌లో కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగిసిపడి అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రోడ్ నంబర్ 36లో ఉన్న బై ది బాటిల్ పబ్ లో ఉంది. గ్యాస్ కొరత కారణంగా కిచెన్‌లో కట్టెల పొయ్యిపై సోమవారం అర్ధరాత్రి వంట చేస్తున్నారు.
కట్టెల పొయ్యి నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడి థర్మకోల్‌తో చేసిన సీలింగ్‌కు తగలడంతో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి. ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వగా సకాలంలో వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
