బిగ్గెస్ట్ టాప్ ఓపెనింగ్స్ దిశగా OG.. పుష్ప 2 బ్రేక్ చేసి RRRకి దగ్గరగా.. తొలి రోజే రూ.150 కోట్లు ఖాయమా?

బిగ్గెస్ట్ టాప్ ఓపెనింగ్స్ దిశగా OG.. పుష్ప 2 బ్రేక్ చేసి RRRకి దగ్గరగా.. తొలి రోజే రూ.150 కోట్లు ఖాయమా?

OG మూవీ రిలీజ్కు ముందే రికార్డులు సృష్టిస్తుంది. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే అత్యధిక ప్రీ సేల్స్ బుకింగ్స్తో అదరగొడుతుంది. లేటెస్ట్ ఓజీ లెక్కలతో దేశ, విదేశాల్లో పవర్ మేనియా ఓ ప్రభంజనంలా వ్యాపించింది. ఈ క్రమంలో ఓజీ మూవీ ఫస్ట్ డే (సెప్టెంబర్ 25న) రూ.150 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం కన్ఫామ్ అని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే, ఈ మూవీ వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.75 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ బుధవారం (సెప్టెంబర్ 24) రాత్రి ప్రీమియర్ షోలు, ఫస్ట్ డే బుకింగ్స్ అన్నిటీనీ కలుపుకుని రూ.75 కోట్లు వచ్చినట్లు టాక్.

ఓవర్సీస్ మొత్తంలో 3.3 మిలియన్ల డాలర్లుకి పైగా (రూ.29 కోట్లు) దక్కించుకుని సత్తా చాటింది. కేవలం ఒక్క నార్త్ అమెరికాలోనే 2.6 మిలియన్ డాలర్లు (రూ.23కోట్లు)కి పైగా కలెక్ట్ చేసింది. ఈ లెక్కలు కూడా గంట గంటకు మారుతూ వెళ్తుండటం పవర్ స్టామినా తెలియజేస్తుంది. ఇక ఈ లెక్కన చూసుకుంటే.. ఓజీ మూవీ ఈజీగా రూ.150 కోట్లకి పైగా గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా లెక్కగట్టాయి. 

ఓజీ ఒక్క నార్త్ అమెరికాలోనే 2.6 మిలియన్ డాలర్లకి పైగా కలెక్ట్ చేసి.. పుష్ప 2, సలార్ సినిమాల ప్రీ సేల్స్ వసూళ్లని బీట్ చేసి పరుగులు తీస్తుంది. ఇంకా ఓజీ లెక్కలు కొనసాగుతున్నాయి కాబట్టి.. కల్కి 2.77 మిలియన్ డాలర్లను బీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఓవర్సీస్ USA ప్రీమియర్స్లో ఫైనల్ సేల్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి.

తెలుగు టాప్ 10 ప్రీమియర్స్ ఫైనల్ సేల్స్:

కల్కి- 2.77 మిలియన్ డాలర్లు

RRR -2.75 మిలియన్ డాలర్లు

OG - 2.6 మిలియన్ డాలర్లు (ఇంకా కొన్ని గంటలు ఉన్నాయి)

దేవర - 2.33 మిలియన్ డాలర్లు

పుష్ప 2- 2.29 మిలియన్ డాలర్లు

సలార్ - 1.8 మిలియన్ డాలర్లు

గుంటూరు కారం- 1.06 మిలియన్ డాలర్లు

గేమ్ ఛేంజర్- 658K డాలర్లు

వార్- 562K డాలర్లు

హరిహర వీరమల్లు - 503K డాలర్లు

మన ఇండియా బుకింగ్స్ విషయానికి వస్తే.. కేవలం ప్రీమియర్స్ షోల ద్వారానే దాదాపు రూ. 40 కోట్లు వచ్చాయని టాక్. అయితే, ఇంత బలమైన నెంబర్స్ రావడానికి కారణంలేకపోలేదు. ఏపీ, తెలంగాణల్లో మూవీ ప్రీమియర్ షోలకు రూ.1000 వరకు టికెట్ల రేట్లు పెంచారు. దానికితోడు కొన్నిచోట్ల 3వేల నుంచి 4 వేల వరకు ఒక్కో టికెట్టు ధర పలుకుతుంది.

ప్రస్తుతం ఇండియాలోని 90% ఏరియాల్లో బుకింగ్స్ ఓపెన్ అయినట్లే. కానీ, ఇంకొన్ని చోట్ల బుకింగ్స్ స్టార్ట్ అవ్వలేదని సమాచారం. మరికాసేపట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. ఇక ఇవి కూడా మొదలైతే.. ఓజీ అడ్వాన్స్ లెక్కలు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 

►ALSO READ | పవన్ కళ్యాణ్ 'OG'కి షాక్: టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు

ఈ గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ డ్రామా ట్రైలర్కి వీపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. హంగ్రీ చితా హంటింగ్ మొదలు అన్నట్లుగా పవర్ తుఫాను సిద్ధమైంది. ఇక పవన్ గ్యాంగ్ స్టార్ డ్రామా మరికొన్ని గంటల్లో అసలు లెక్క తేల్చనుంది. చూడాలి మరి ఏమవుతుందో!

ఇందులో ప్రియాంకా మోహన్తో పాటుగా ఇమ్రాన్ హష్మీ విలన్‌‌గా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.