- కేఏ పాల్ కూడా పెట్టారు
- బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. కవిత పెట్టబోయే పార్టీపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చే యించాలని అన్నారు. ఆమె ఆత్మగౌరవం దెబ్బతినటం అనేది వాళ్ల కుటుంబ అంశమని అన్నారు.
కవిత పార్టీతో బీజేపీకి ఎలాంటి సష్టమూ ఉండబోదన్నారు. తెలంగాణ ప్రజలుబీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. కవిత తప్పు చేసింది కాబట్టే జైలుకు వెళ్లిందని చెప్పారు. బీజేపీ కక్ష పూర్వక రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పారు.
