మానసిక దృఢత్వంతో ఏదైనా సాధించవచ్చు .. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మానసిక దృఢత్వంతో ఏదైనా సాధించవచ్చు .. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి, వెలుగు: మానసికంగా దృఢంగా ఉంటే ప్రపంచాన్ని కూడా జయించవచ్చని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరిలోని జీకే ఫంక్షన్ హాల్​లో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఏ రంగంలో రాణించాలన్నా మానసిక ప్రశాంతత ముఖ్యమన్నారు. మాజీ కార్పొరేటర్ జగదీశ్​ గౌడ్​, ప్రోగ్రామ్ చైర్మన్ లయన్ ప్రొఫెసర్ పఠాన్ ఉమర్ ఖాన్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రామచందర్, సైకియాట్రిస్ట్ డాక్టర్​ దొంతుల ప్రవీణ్, టీపీఏ జిల్లా అధ్యక్షురాలు అలియా పర్వీన్  పాల్గొన్నారు.

ఔట్‌‌ సోర్సింగ్ ఉద్యోగుల వినతి..

తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఔట్‌‌ సోర్సింగ్ ఉద్యోగులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మాటిచ్చారు.