24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

V6 Velugu Posted on Sep 16, 2021

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఈనెల 24వ తేదీ నుంచి రాష్ట్ర శాసన సభా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినా.. ఎన్ని రోజులపాటు నిర్వహించాలనేది నిర్ణయించలేదు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనేది చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ప్రాథమికంగా అంచనాల ప్రకారం నాలుగైదు రోజులు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టాల్సిన కీలక బిల్లుల జాబితాను ప్రభుత్వం ఖరారు చేయడంపై దృష్టి సారించింది.
 

Tagged VIjayawada, AP government, Amaravati, CM YS Jagan, ap today, AP cabinet, , ap cabinet decessions, bejawada

Latest Videos

Subscribe Now

More News