రేపు ఏపీ బంద్.. మద్దతు ప్రకటించిన వైసీపీ, టీడీపీ

రేపు ఏపీ బంద్.. మద్దతు ప్రకటించిన వైసీపీ, టీడీపీ
  • స్కూళ్లు.. కాలేజీలకు సెలవు
  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు బంద్

అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు అధికార వైసీపీతోపాటు.. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతోపాటు అన్ని పక్షాలు మద్దతు ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం కూడా సంఘీభావం ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు కూడా మూసివేసి బంద్ కు సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించారు.  మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  మంత్రి పేర్ని నాని వెల్లడించారు.  సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  రేపు బంద్‌ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్లు చెప్పారు.  ఒంటిగంట తర్వాత యథావిధిగా ఆ బస్సులు తిరుగుతాయన్నారు. ఆర్టీసీ సిబ్బంది విధిగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మంత్రి పేర్ని నాని కోరారు. ప్రైవేటీకరణ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయోమో ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

బదిలీల్లో స్పౌస్ కేటగిరీని దుర్వినియోగం చేసిన టీచర్లు

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప.. క్యాచ్ అందుకున్న డెలివరీ బాయ్

ఆనంద్ మహీంద్రా ట్వీట్: ఇది ఎలిఫెంట్ కాదు.. ఎలీ-ప్యాంట్