జేఎన్టీయూలో లైబ్రరీ ఫెస్టివల్

జేఎన్టీయూలో లైబ్రరీ ఫెస్టివల్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక స్పెషల్ డ్రైవ్​లో భాగంగా జేఎన్టీయూ వర్సిటీ లైబ్రరీలో ‘లైబ్రరీ ఫెస్టివల్’ నిర్వహించారు. ఈ సందర్భంగా యూసీఈఎస్‌‌‌‌‌‌‌‌టీహెచ్ కాలేజీ లైబ్రరీలో పుస్తక ప్రదర్శనను వీసీ డాక్టర్ టి. కిషన్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. డాక్టర్ కె. విజయ కుమార్ రెడ్డి, జేఎన్టీయూ హెచ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు, లైబ్రేరియన్లు డాక్టర్ రూప్‌‌‌‌‌‌‌‌ సింగ్ నాయక్, జె. ఉషా రాణి  పాల్గొన్నారు.