ప్రజలపై ఏపీ సీఎం జగన్ వరాల జల్లు

ప్రజలపై ఏపీ సీఎం జగన్ వరాల జల్లు

ఏపీ సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు.  సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  వైఎస్ఆర్ చేనేత అస్త్రం పేరుతో  ప్రతీ సంవత్సరం ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24వేలు ఇచ్చేలా కేబినెట్ ఆమోదించింది. ఏడాది డిసెంబర్ 21న ఒకే విడతలో కుటుంబానికి రూ.24వేలు అందించనుంది.  తద్వారా ఈ పథకం కింద 90వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరునున్నాయి. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు, తెప్పలపై చేపల వేటకు వెళ్లే వారికీ   రూ.12వేలు అందించనుంది. న్యాయవాదులకు మూడేళ్ల పాటు నెలకు రూ.5వేల గౌరవ వేతనం అందించనుంది. ఈ పథకం డిసెంబరు 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా  ప్రారంభిస్తున్నట్లు సమాచారశాఖ మంత్రి మంత్రి పేర్ని నాని తెలిపారు. జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్ లు ఏర్పాటు చేసి,  ప్రతి కుటుంబానికి 110 నుంచి 150 లీటర్లు రక్షిత మంచి నీరు అందించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది.

*  మధ్యాహ్న భోజనం పథకం కింద 88,296 మంది వాలంటీర్లకు లబ్ధి వేతనాన్ని రూ.1000 నుంచి 3వేలకు పెంచింది.

* హోంగార్డు రోజువారి వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కి పెంచింది.

* పలాసలో 200 పడకల కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్  5 రెగ్యులర్, 100 కాంట్రాక్ట్, 60 ఔట్ సోర్సింగ్ నిమామకాల భర్తీకి కేబినెట్  అనుమతించింది.

* ప్రతి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గానికి బోర్ వెల్ యంత్రాల ఏర్పాటు

* నిరుద్యోగులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా  సబ్సిడీపై వాహనాలు

* ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా బ్యాంకు ఖాతాలోకే జీతాలు

* ఏపీఎస్ ఆర్టీసీలో కాలం చెల్లిన 3500  బస్సుల స్థానంలో కొత్త బస్సులు.

* చిరు ధాన్యాలు,అపరాలు,కొబ్బరి కొనుగోలుకు బోర్డులు ఏర్పాటు.