పోలవరంపై KCRకు హక్కు లేదు : చంద్రబాబు

పోలవరంపై KCRకు హక్కు లేదు : చంద్రబాబు

ప్రకాశం : ఎన్నికల ప్రచారంలో డోస్ పెంచారు AP CM చంద్రబాబు. మోడీ, కేసీఆర్, జగన్ టార్గెట్ గా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. గురువారం ప్రకాశం జిల్లా, అద్దంకిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు చంద్రబాబు. నరేంద్రమోడీ ఓ నమ్మకద్రోహి అంటూ విమర్శించిన బాబు…. ఏపీ ప్రజల గోస తగులుతుందని శాపాలు పెట్టారు. పోలవరంపై ఏ హక్కు ఉందంటూ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అవసరమైతే భద్రాచలాన్ని తీసుకుంటామని.. ఆ తర్వాత ఏం అవుతోందో చూస్తామంటూ సవాల్ చేశారు.  రాష్ట్రంలో రౌడీ రాజ్యం రానివ్వనన్న చంద్రబాబు.. కేసుల నుంచి తప్పించుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.

అవినీతి డబ్బుతో బూత్‌ ఏజెంట్లను కొంటారట.. ఈ పవిత్ర గడ్డపై మోడీ, కేసీఆర్‌ పంపించే పాపిష్టి డబ్బు మనకు వద్దు. జగన్‌ కు అంత డబ్బు ఎక్కడిది? వ్యాపారాలు చేశారా? వ్యవసాయం చేశారా? కేసీఆర్‌ ఆటలు నా దగ్గర సాగవు’ అని తెలిపారు చంద్రబాబు.