చంద్రబాబుకు సెంటిమెంట్ : డిపాజిట్ కోసం విరాళాలు

చంద్రబాబుకు సెంటిమెంట్ : డిపాజిట్ కోసం విరాళాలు

ఎన్నికలకు రెడీ అవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. శుక్రవారం కుప్పం నుంచి నామినేషన్ వేసిన ఆయన..డిపాజిట్ కోసం తన సొంత డబ్బును చెల్లించలేదు. అయితే దీని వెనక పెద్ద సెంటిమెంట్ ఉందట. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు విజయానికి తిరుగులేదు. మూడు దశాబ్ధాలుగా ఇక్కడి నుంచే ఆయన విజయ సాధించారు. విజయం కోసం అతడు నామినేషన్ కు డిపాజిట్ సొమ్ము చెల్లించరు. విరాళాలు సేకరించిన సొమ్ముతో నామినేషన్ డిపాజిట్ చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే చంద్రబాబుకు సెంటిమెంట్. కుప్పంలో ఇప్పటికి కొనసాగుతుంది ఈ సంప్రదాయం.

కుప్పం శాసనసభ స్థానానికి 1989 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ఆరుసార్లు గెలుపొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజకేతనం ఎగరవేస్తున్నారు.  ఏడోసారి ఎన్నికల రణరంగంలోకి సిద్దమయ్యారు. అయితే ఈ నియోజకవర్గంలో చంద్రబాబు గెలవడానికి ఇదే సెంటిమెంట్ ను నమ్ముతారట. విరాళాలు సేకరించిన సొమ్ముతో నామినేషన్ డిపాజిట్ చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. 1999 నుండి చంద్రబాబు నామినేషన్ డిపాజిట్ సొమ్మును ప్రజల నుండి విరాళంగా సేకరించడం సంప్రదాయంగా వస్తోంది. బిందెలపై ఎన్టీఆర్, చంద్రబాబు, సైకిల్‌ గుర్తుల ఫోటోలను అతికించి, బిందెకు పైన పసుపు బట్టతో చుట్టి హుండీలా తయారు చేస్తారు.

నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోను, గుడుపల్లెలోని 18  గ్రామ పంచాయతీలకు సంబంధించి 18 పసుపు బిందెలను పంపిణీ చేశారు. వాటితో నామినేషన్ కు ముందు తెలుగు తమ్ముళ్లు ఐదురోజుల పాటు తిరిగి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తారు. వచ్చిన విరాళాల సొమ్ముతో డిపాజిట్ చెల్లించడం సెంటిమెంట్​గా కొనసాగుతోంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి వద్ద కొంత నగదు జమ చేయాలి. ఆరో వంతు కన్నా తక్కువ ఓట్లొస్తే డిపాజిట్ కోల్పోయినట్టు లెక్క. అందరి మాదిరిగానే చంద్రబాబు.. కార్యకర్తలు, అభిమానులు ప్రేమతో ఇచ్చిన డబ్బులతో డిపాజిట్ చెల్లిస్తుంటారు. శుక్రవారం చంద్రబాబు తరపున పార్టీ శ్రేణులు, డిపాజిట్ చెల్లించి, నామినేషన్ దాఖలు చేశారు. మరి ఈ సారి ఇదే సెంటిమెంట్ తో బాబు గెలుస్తారా లేదా అనేది చూడలంటున్నారు పబ్లిక్.