
రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈరోజు రాయలసీమలో సముద్రం కన్పిస్తోందన్నారు. వేరే రాష్ట్రాల్లో ఉంటూ.. అప్పుడప్పుడు మోసం చేసేందుకు ‘నాన్ రెసిడెన్సీ ఆంధ్రాస్’ మన రాష్ట్రానికి వస్తుంటారని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు.. అటువంటి నాన్ రెసిడెన్సీ ఆంధ్రాస్ కు, ఈ గడ్డ మీద పుట్టి, ఇక్కడే మీ మధ్య ఉంటున్న మనకు మధ్య ఈ యుద్ధం జరగబోతుందని తెలిపారు. 2024 ఎన్నికల్లో యుద్ధం రెండు సిద్ధాంతల మధ్య జరగబోతోందని అన్నారు. ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా.. అని అన్నారు. ఈ యుద్ధం పేదలకు.. పెత్తందారులకు మధ్య జరగబోతుందని,. ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోతుందని తెలిపారు.
మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. మీరిచ్చిన మేనిఫెస్టోలో కనీసం మూడు శాతం అమలు చేశారా అని ప్రశ్నించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన రైతులకు ఏమైనా చేశారా అంటూ దుయ్యబట్టారు. అక్కాచెల్లెమ్మలకు కనీసం ఒక్క పథకమైనా పెట్టారా.. బడికి వెళ్లే విద్యార్థులకు ఏమైనా చేశారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చెప్పాలని తెలిపారు.
ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, మోసాలతో మేనిఫెస్టోతో ముందుకువస్తున్నాడన్నారు. బంగారు కడియం ఇస్తామని ఊబిలోకి దింపి మనుషులను తినేసే పులి మాదిరిగా ఎర చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ఆరు స్కీమ్ లు అంటాడు.. రంగురంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేసేందుకు బయల్దేరారని అన్నారు. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడనే చంద్రబాబు సిద్ధాంతమన్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయలేదని.. ఒక్క పథకం తీసుకురాలేదన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదని విమర్శించారు..
రాప్తాడు సభలో హైలెట్స్
చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే
కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా?
- చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికీ పథకాలు గుర్తుకురావు
- ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచిపని ఒక్కటైనా ఉందా?
- 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా?
- మళ్లీ అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారు
- రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు
- చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఎవరకీ గుర్తుకురాదు
- మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారు
- సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలి
- సిద్దమని వైసీపీ అంటే... టీడీపీ సంసిద్దం అంటూ పోస్టర్లు వేయిస్తుంది
- పెత్తం దార్ల తరపున చంద్రబాబు సిద్దం అయ్యారు
- చంద్రబాబు కుర్చీలు మడిచి 23 సీట్లకు తగ్గించారు
- అసలు చంద్రబాబుకు ఓట్లు ఎందుకు వేయాలి
- ప్రజలు ఐదేళ్లు చొక్కాలు మడత పెట్టుకున్నారు
- దుష్ట చతుష్టయానికి తల వంచడానికి అభిమన్యుడిని కాదు.. అర్జునిడిని
- మీ బిడ్డ 125 సార్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్ళ ఖాతాల్లో జమ చేశాం
- రూ. 2.55 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఖాతాల్లో వేశాం
- వైఎస్సార్‌సీపీ మార్క్ ప్రతీ ఇంట్లోనూ కనిపిస్తోంది
- 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యత
- 57 నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించాం
- 57 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
- 57 నెలల పాలనలో జరిగిన మంచిని ప్రజలందరికీ వివరించండి
- 57 నెలలు కాలంలోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం
- పెన్షన్ కొనసాగాలంటే మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలి
- 31 లక్షల ఇళ్ల పట్టాల ఇచ్చిన ప్రభుత్వం మనది
- పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం
- పెత్తందారుల పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలంటే మళ్లీ మన ప్రభుత్వ రావాలి
- వైఎస్సార్‌సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తుకువస్తాయి