శ్రీశైలం డ్యాం నీళ్లపైనా.. ఏపీ కుట్రలు

శ్రీశైలం డ్యాం నీళ్లపైనా.. ఏపీ కుట్రలు

పోతిరెడ్డిపాడు కోసం మరో ఎత్తు గడ

నాగార్జునసాగర్ కు నీటి విడుదల ఆపాలని డిమాండ్

శ్రీశైలం డ్యాం ప్రొటోకాల్ కు వ్యతిరేకంగా పావులు

లేని రూల్స్​ను ముందు పెట్టి నీటి దోపిడీకి ప్లాన్

మండిపడుతున్న తెలంగాణ ఇంజనీర్లు

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం నీటిపై ఏపీ కొత్త కుట్రలకు తెరతీసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు నీటిని తరలించేందుకు మరో స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్ కు నీటి విడుదలను ఆపాలని డిమాండ్ చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన ఉద్దేశానికే కొత్త అర్థం చెప్పే డ్రామాను షురూ జేసింది. చెన్నై తాగునీటిని ముందు పెట్టి.. సాగర్ కు నీటిని విడుదల చేయవద్దంటూ వితండవాదానికి దిగుతోంది. చెన్నై తాగునీటి కోసం ఇటీవల నిర్వహించిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నాలుగో మీటింగ్ లో, తాజాగా తాగునీటి కోసం 9 టీఎంసీలు విడుదల చేయాలంటూ పంపిన ఇండెంట్ లోనూ ఏపీ అడ్డగోలు వాదనలు చేసింది.

శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించిందే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కోసం… దానికి దిగువనే ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టును శ్రీశైలం నీటితో స్టెబిలైజ్ చేయడానికి. శ్రీశైలంలో నీటి మట్టం 834 అడుగులకు చేరుకోగానే కుడి, ఎడమ గట్టు హైడల్ పవర్ స్టేష న్లలో కరెంట్ ఉత్పత్తి మొదలు పెట్టాలి. ఎగువ నుంచి నిలకడగా వరదలు వస్తే కరెంట్ ఉత్పత్తి చేసిన నీటిని నాగార్జునసాగర్ లోకి వదులుతా రు. ఇన్ ఫ్లోస్ సరిపడా లేకుండా పవర్ జనరేట్ చేసిన నీటిని రివర్సబుల్ మోటార్ల ద్వారా తిరిగి డ్యాంలోకే ఎత్తిపోస్తా రు. శ్రీశైలంలోకి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో తెలంగాణ జెన్ కో ఆఫీసర్లు ఎడమ గట్టు పవర్ స్టేష న్ లో కరెంట్ ఉత్పత్తి ప్రారంభించి సాగర్ లోకి నీటి తరలింపును మొదలుపెట్టారు. దీనిపై ఏపీ పెద్ద డ్రామానే స్టార్ట్​ చేసింది. శ్రీశైలం డ్యాం ఎస్ఈ కేఆర్ఎంబీకి లెటర్ రాయడంతోపాటు, బోర్డు చైర్మన్, మెంబర్ సెక్రటరీలకు ఏపీ ఈఎన్సీ వాట్సప్ లో కంప్లయింట్ చేశారు. దీంతో ఆగమేఘాల మీద స్పందించిన కేఆర్ఎంబీ.. పవర్ జనరేషన్ ద్వారా సాగర్ కు నీటి విడుదలను ఆపాలంటూ తెలంగాణను ఆదేశించింది. శ్రీశైలం డ్యాం నిర్మాణ స్ఫూర్తి కి విరుద్ధంగా జారీ చేసిన ఆదేశాలను లైట్ తీసుకున్న తెలంగాణ.. పవర్ జనరేషన్ ను కొనసాగిస్తోంది.

17 టీఎంసీలకు టెండర్

పవర్ జనరేషన్ ద్వారా తరలించే నీటిని రెండు రాష్ట్రాల కామన్ ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ కే తరలిస్తోంది తప్ప ఎక్కడా తెలంగాణ తన అవసరాలకు ఉపయోగించుకోవడం లేదు. అయినా దానిని ఏపీ తప్పు బడుతోంది. తెలంగాణపై కంప్లయిం ట్ చేసిన రోజే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి తరలింపును మొదలు పెట్టి ఔట్ ఫ్లోను ఏపీ క్రమేణా పెంచుతూ పోతుంది. కర్నూలు , అనంతపురం తాగునీటి అవసరాలకు 8 టీఎంసీలు కావాలని చెప్తూ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 21నే లిఫ్టింగ్ మొదలు పెట్టింది. చెన్నై, రాయలసీమ తాగునీటి అవసరాల పేరుతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 9 టీఎంసీలు తరలించే ప్రక్రియను గురువారం ప్రారంభించింది. ఆగస్టు నెలాఖరు వరకు ఈ రెండు పాయింట్ల ద్వారా 17 టీఎంసీలను తరలించుకుంటామని కేఆర్ఎంబీకి సమాచారం ఇచ్చింది. బోర్డు ఎలాంటి రిలీజ్ ఆర్డర్ ఇవ్వకున్నా దర్జాగా ఏపీ నీటిని తరలిస్తోంది.

సాగర్ కు నీటి విడుదలే అసలు ప్రొటోకాల్

చెన్నైకి తాగునీటి పేరుతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ ప్రాంతానికి నీటి తరలింపును మొదలు పెట్టిన ఏపీ.. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు ప్రధాన అవసరమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ ను ఆపరేట్ చేయడం అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. శ్రీశైలం నిర్మించింది హైడ్రో పవర్ జనరేషన్, సాగర్ కు సంప్లి మెంటేషన్ చేయడానికి అనే వాస్తవాన్ని పరిచేం దుకు కొంత కాలంగా ఓ పథకం ప్రకారం పనిచేస్తోంది. చెన్నైకి తాగునీటిని విడుదల చేయకుండా తెలంగాణనే అడ్డుపడుతుందనే తప్పుడు ప్రచారమూ  చేస్తోంది. బోర్డు మీటింగుల్లోనూ ఇదే అడ్డగోలు వాదనలతో తప్పుదోవ పట్టిస్తోంది. తెలంగాణ ఇంజనీర్లు ఆయా సందర్భాల్లో అసలు శ్రీశైలం డ్యాం ఆపరేషన్ ప్రొటోకాల్స్ ఏమిటో గుర్తు చేస్తూ కౌంటర్ చేస్తున్నా.. ఏపీ మాత్రం తన వాదనను అలాగే కొనసాగిస్తోంది. పదేపదే తప్పును ప్రచారంలో పెట్టి అదే నిజమని నమ్మించడానికి ప్రయత్నిస్తోంది

డ్యాం ఆపరేషన్ ప్రొటోకాల్ ను కాదని..

శ్రీశైలం డ్యాం నిర్మాణ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తోందని తెలంగాణ ఇంజనీర్లు మండిపడుతున్నారు. డ్యాం ఆపరేషన్ ప్రొటోకాల్ కు తనదైన భాష్యం చెప్పుకుని అలాగే నడుచుకోవాలని కోరడం సరికాదని అంటున్నారు. కేఆర్ఎంబీ రిలీజ్ ఆర్డర్ ఇవ్వకున్నా ఏకపక్షంగా నీటిని తరలించుకుపోతూ తెలంగాణపైనే నిందలు వేస్తోందని చెప్తున్నా రు. ఏటా వరదలు మొదలు కాగానే చెన్నైకి తాగునీటి పేరు చెప్పి రాయలసీమ, ప్రకాశం, నెల్లూ రు జిల్లాలకు నీటిని మళ్లిం చుకుంటున్నారని, ఏ ఒక్క ఏడాది కూడా చెన్నైకి పూర్త స్థాయిలో నీటిని విడుదల చేయలేదని అంటున్నారు. ప్రతి విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తూఇప్పుడు పోతిరెడ్డిపాడు కోసమే శ్రీశైలం ప్రాజెక్టును కట్టినట్టుగా ప్రచారం చేయాలని చూడటం సరికాదని చెప్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండిన తర్వాతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తరలించాల్ సి ఉంటుందని, ఆ నిజాన్ని మరుగు పరిచేందుకే ఏపీ కొత్త కొత్త కుట్రలు చేస్తోం దని తెలంగాణ ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.