ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికలు: సీఎంజగన్​

ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికలు: సీఎంజగన్​

 ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముందే వచ్చే అవకాశం ఉందని.. అందుకు తగ్గట్టు పార్టీ రెడీగా ఉండాలని మంత్రులను ఆదేశించారు సీఎం జగన్. డిసెంబర్ 15వ తేదీన జరిగిన కేబినెట్ భేటీ ఈ వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని.. దీంతో ఏపీ ఎన్నికలు ఫిబ్రవరి నెలాఖరులోనే జరగొచ్చని స్పష్టం చేశారు సీఎం జగన్.

ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్​అధ్యక్షతన ఏపీ కేబినెట్​ భేటి జరిగింది. ఈ సమావేశంలో సీఎం జగన్​ కీలక వ్యాఖ్యలు చేశారు.  2024 ఎన్నికల షెడ్యూల్​ ముందుగానే వెలువడే అవకాశం ఉందంటూ ... .. అన్ని కార్యక్రమాలు 2024 ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించారు.  ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు.. ఇక చేసేది ఒక ఎత్తు అని సీఎం జగన్​ అన్నారు.  15 రోజులు ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడుతుందన్నారు.  .. అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో వ్యాఖ్యానించారాయన.  మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలని సీఎం జగన్​ సూచించారు.  పార్టీ నేతలు.. కార్యకర్తలు ప్రజల మధ్యఏ తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం  చేయాలని మంత్రులకు సూచించారు.