ఏపీలో 175 స్థానాలు..2118 మంది పోటీ

ఏపీలో 175 స్థానాలు..2118 మంది పోటీ

ఏపీలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఏపీలో దాదాపు 4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45,920 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అధికారులు. 

  • రాష్ట్ర జనాభా మొత్తం       55,30,01,971
  • ఏపీలో ఓటర్ల సంఖ్య        3,93,45,717
  • పురుష ఓటర్లు               1,94,62,339
  • మహిళా ఓటర్లు              1,98,79,421
  • ట్రాన్స్ జెండర్లు               3,967

అత్యధికంగా కాకినాడ సిటీలో 142 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. అమలాపురంలో ట్రాన్స్ జెండర్లు  లేరు. అత్యధికంగా  గాజువాకలో 3,09,326 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా పెడనలో 1,66,177 మంది ఓటర్లు ఉన్నారు.

  • ఏపీలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 45,920
  • పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు 7,973,
  • గ్రామీణ ప్రాంతాల్లో 37,947 పోలింగ్ స్టేషన్లు

పార్టీలు పోటీచేయబోయే స్థానాలు

వైసీపీ, టీడీపీలు 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. జనసేన 137 అసెంబ్లీ , 16 పార్లమెంటు సీట్లలో పోటీచేస్తుంది. ఇక జనసేన మిత్రపక్షమైన  బీఎస్పీ 13 అసెంబ్లీ, 3 లోక్ సభ, సీపీఐ, సీపీఎంలు ఏడేసి అసెంబ్లీ, రెండేసి లోక్ సభ సీట్లలో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 173 అసెంబ్లీ సీట్లు, 24 లోక్ సభ, కాంగ్రెస్ 174 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లలో పోటీ చేస్తున్నాయి. ఇతర పార్టీలు, స్వతంత్రులుగా అన్ని నియోజకవర్గాల్లోనూ 1,249 మంది అసెంబ్లీకి, 193 మంది పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారు.

  • అసెంబ్లీకి పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 2,118
  • పురుషులు 1,945 మంది , స్త్రీలు 172 మంది,  ట్రాన్స్ జెండర్ ఒకరు.
  • పార్లమెంట్ కు పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 319
  • పురుషులు 292, మహిళలు 27 మంది.

అత్యధికంగా  నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి  20 మంది పోటీ చేస్తున్నారు. అతి తక్కువగా చిత్తూరు నుంచి కేవలం 8 మంది పోటీ చేస్తున్నారు.