ప్రతి పైసా ఖజానాకు చేరాల్సిందే

ప్రతి పైసా ఖజానాకు చేరాల్సిందే
  • ఇకపై ఏపీ ఎండీసీ ద్వారా  ఇసుక విక్రయం
  • అధికారులతో ఏపీ సీఎం జగన్

అమరావతి, వెలుగు: ఇసుకపై వచ్చే ప్రతి పైసా ఖజానాకే చేరాలని ప్రజాప్రతినిధులు, అధికారుల జేబుల్లోకి వెళ్లరాదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇసుక అమ్మాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇసుకను ఆదాయ వనరుగా చూడరాదన్నారు. మార్కెట్ రేటు కన్నా తక్కవకే ఇసుక అందించాలన్నారు. సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక వినియోగదారుల కోసం ఏపీఎండీసీ యాప్,​ వెబ్​ పోర్టల్​ తయారు చేయాలని సూచించారు.  ఈ నెల 12న ప్రవేశపెట్టే బడ్జెట్ లో కేటాయింపులపై ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. నవరత్నాల అమలుకు అవసరమైన నిధులపై ఆరా తీశారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి అందే సాయాన్ని అధికారులు జగన్​కు వివరించారు. కేంద్ర సాయం పోను నవరత్నాలకు రూ.12 వేల కోట్లు అదనంగా ఖర్చవుతుందని అంచనా వేశారు.