వివేకా హత్యకేసు దర్యాప్తు ముమ్మరం

వివేకా హత్యకేసు దర్యాప్తు ముమ్మరం

కడప: అసెంబ్లీ ఎన్నికల ముందు దారుణ హత్యకు గురైన వై.యస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఇంకా నిందితులెవరో తేలలేదు. హత్య జరిగి 4 నెలలు గడుస్తున్నా.. విచారణ ముందుకు సాగక పోవడంతో ఏపీ కొత్త ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేసింది.

కడప ఎస్పీ అభిషేక్‌ మహంతి ఆధ్వర్యంలో ప్రభుత్వం కొత్త సిట్‌‌ ను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటైన సిట్‌లో  అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కడప కు చెందిన మొత్తం 23 మంది అధికారులు ఉన్నారు. వీరంతా నిన్న వివేకా ఇంటిని మరోసారి పరిశీలించారు. వివేకా వాచ్‌మెన్‌ రంగయ్యను విచారించారు. కొత్త సిట్ ఏర్పాటుతో త్వరలో ఈ హత్య కేసులో నిందితులెవరనేది తెలుస్తుందని వివేకానంద రెడ్డి అనుచరులు భావిస్తున్నారు.