
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు రోజురోజుకూ బాగా పాపులర్ అవుతున్నాయి. దీనికి కారణం నిపుణులు డబ్బును మేనేజ్ చేయటంతో పాటు తక్కువ మెుత్తాల్లో కూడా పెట్టుబడులను స్టార్ట్ చేసేందుకు వీలుండటమే. ఈక్విటీ పెట్టుబడుల కంటే వీటి అన్వేషణకు తక్కువ సమయం కేటాయించాల్సి రావటం కూడా మధ్యతరగతి ప్రజలకు చేరువయ్యాయి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు.
జూలై నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి పెట్టుబడులు అంతకు జూన్ మాసం కంటే 81 శాతం పెరిగి రికార్డ్ సృష్టించాయి. దీంతో జూలైలో ఇన్వెస్టర్లు రూ.42వేల 702 కోట్లు ఈక్విటీ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వెల్లడించింది. మెుత్తంగా జూలై నెలలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు దేశంలో రూ.లక్ష 80వేల కోట్లకు చేరినట్లు వెల్లడైంది. ఇది జూన్ మాసంలో కేవలం 49వేల కోట్లుగా మాత్రమే ఉంది.
ప్రధానంగా ఈక్విటీ స్కీమ్స్, సెక్టోరల్ స్కీమ్స్, థీమ్యాటిక్ ఫండ్స్ అధిక పెట్టుబడులను చూశాయి. ఇందులో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా రూ.7వేల 654 కోట్లను పొందాయి. ఈక్విటీ ఫండ్స్ చూస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి పెట్టుబడులు జూన్ కంటే 61 శాతం పెరిగి జూలైలో రూ.6వేల 484 కోట్ల ఇన్ ఫ్లోస్ చూశాయి. ఇదే క్రమంలో మిడ్ క్యాప్ ఫండ్స్ రెండవ స్థానంలో నెల ప్రాతిపధికన 38 శాతం పెట్టుబడుల పెరుగుదలను చూశాయి. ఇకపోతే టాక్స్ సేవింగ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ మాత్రం అమ్మకాల జోరును చూశాయి.
ప్రధానంగా భారతీయ రిటైల్ పెట్టుబడిదారుల నుంచి ఈక్విటీ స్కీమ్స్ అధిక పెట్టుబడులను చూస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ సీఈవో అఖిల్ చతుర్వేదీ చెప్పారు. ఇది దీర్ఘకాలంలో మార్కెట్లకు శుభసూచకమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో డెట్ ఫండ్స్ కి కూడా ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరుగుతున్నట్లు గమనించబడింది. ఇక చివరిగా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ నెలవారీ 10 శాతం తగ్గుదలను చూసినట్లు డేటా చెబుతోంది.