వారం ముందుగానే వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు క్లోజ్!

వారం ముందుగానే వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు క్లోజ్!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు జరగాల్సి ఉండగా.. మారుతున్న రాజకీయ పరిణామాలతో ఒక వారం ముందుగానే అంటే  ఆగస్టు 12 ముగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  ఆగస్టు 13 నుంచి 17 వరకు సభలకు విరామం. ఆ తరువాత మళ్ళీ ఆగస్టు 21 వరకు కార్యకలాపాలు సాగాలన్న షెడ్యూల్ ఉంది. 

చివరి నిమిషంలో రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షాల నిరసనలు, కేంద్ర బిల్లులపై విపక్షాల హంగామా, స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు వంటి అంశాల నేపథ్యంలో వారం ముందే సమావేశాలను  ముగించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.పార్లమెంట్ సమావేశాలు షెడ్యూల్ కు ముందే ముగిస్తే.. కొన్ని బిల్లులకు, డిస్కషన్లకు తక్షణ ప్రాముఖ్యత ఇస్తారు. ఈ ప్రతిపాదిత మార్పుకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

మొత్తంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈసారి వివరించిన షెడ్యూల్ కంటే ఒక వారం ముందే ముగిసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పార్లమెంటరీ సంబంధిత శాఖ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 ప్రతిపక్షాల తీవ్ర నిరసనలు ఉన్నప్పటికీ సోమవారం ఒకే రోజు మొత్తం తొమ్మిది బిల్లులను పార్లమెంటు ఆమోదించింది.- లోక్‌సభలో నాలుగు ,రాజ్యసభలో ఐదు బిల్లులను ఆమోదించారు. వీటిలో ఆదాయపు పన్ను బిల్లు, పన్ను చట్టాలు (సవరణ) బిల్లు, మణిపూర్ బడ్జెట్ ,మణిపూర్ GST బిల్లు వంటి కీలక చట్టాలు ఉన్నాయి.

పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గందరగోళం

సోమవారం నాటి పార్లమెంట్ సమావేశాలు ప్రతిపక్ష ఎంపీల తీవ్ర నిరసనలతో ప్రారంభమయ్యాయి.కానీ అధికార పార్టీ బిల్లులను ఆమోదించాలని దృఢంగా నిశ్చయించుకుంది. ఫలితంగా లోక్‌సభ నాలుగు బిల్లులను ఆమోదించగా, రాజ్యసభ ఐదు బిల్లులను ఆమోదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆదాయపు పన్ను బిల్లు ,పన్ను చట్టాల (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. రెండూ చర్చ లేకుండానే ఆమోదించారు. మిగతా రెండు బిల్లులు ఆమోదం పొందే ముందు స్వల్ప చర్చలు జరిగాయి. 

భారత పార్లమెంటులో సైన్ డై అంటే ..

పార్లమెంటు ..లోక్‌సభ లేదా రాజ్యసభ - నిరవధికంగా వాయిదా పడినప్పుడు తదుపరి సమావేశానికి నిర్దిష్ట తేదీని నిర్ణయించకుండానే సెషన్‌ను ముగించడం జరుగుతుంది. ఇది సాధారణ వాయిదా నుంచి భిన్నంగా ఉంటుంది..ఇక్కడ సభ ఆగి, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తరువాత తిరిగి సమావేశమవుతుంది. సాధారణంగా సెషన్ పని పూర్తయిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ - లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ - నిరవధికంగా వాయిదా వేసే నిర్ణయం తీసుకుంటారు. తరువాత భారత రాష్ట్రపతి అధికారికంగా సభను ప్రోరోగ్ చేస్తారు.