వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. జంతు ప్రేమికులు అడ్డుకుంటే చర్యలు తప్పవు..

 వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. జంతు ప్రేమికులు అడ్డుకుంటే చర్యలు తప్పవు..

ఢిల్లీ NCRలో వీధి కుక్కలను ప్రజలు ఉండే ఇళ్ల నుండి దూరంగా తరలించాలని, ఈ విధానాన్ని అడ్డుకునే ఏ సంస్థ అయినా కఠినమైన చర్యను ఎదుర్కోవలసి ఉంటుందని నేడు సుప్రీంకోర్టు ఆదేశించింది. కుక్క కాటు, రాబిస్ వల్ల మరణాలు పెరుగుతుండటంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కొంతకాలంగా ఇళ్ల మధ్యలో ఉండే వీధి కుక్కల వల్ల పిల్లలు, వృద్ధులు గాయపడుతుండటం, కొన్ని సందర్భాల్లో మరణించడం మీకు తెలిసిసిందే. 

వీధికుక్కల దాడులతో పెరుగుతున్న రేబిస్ మరణాలపై వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకొని జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని విచారిస్తోంది. కేంద్రం నుండి మాత్రమే వాదనలు వింటామని, జంతు లేదా కుక్కల  ప్రేమికులు ఇంకా ఇతరుల నుండి వచ్చిన పిటిషన్లను ఈ విషయంపై విచారించబోమని కోర్టు తేల్చి చెప్పింది.

మేము దీన్ని మా కోసం చేయడం లేదు, ప్రజా ప్రయోజనాల కోసమే. కాబట్టి, ఎటువంటి మనోభావాలు ఇందులో పాల్గొనకూడదు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాంతాల నుండి కుక్కలను తీసుకొని దూర ప్రాంతాలకు తరలించండి. ప్రస్తుతానికి, నియమాలను మరచిపోండి అని జస్టిస్ పార్దివాలా అన్నారు. 

ఈ జంతు కార్యకర్తలందరూ రేబిస్ బారిన పడిన వారిని తిరిగి తీసుకురాగలరా ? మనం వీధులను వీధికుక్కలు లేకుండా చేయాలి, వీధికుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతించమని కూడా కోర్ట్ తెపింది.  

►ALSO READ | ఇలా బాధ పెడతారా..? టాటా ఉంటే ఇలా చేసే వారు కాదు: ఎయిరిండియాపై అమెరికా లాయర్ ఆగ్రహం

 పట్టుకున్న వీధికుక్కలు డాగ్ షెల్టార్లకు తరలించాలని అలాగే  అక్కడ వాటిని పట్టుకొని స్టెరిలైజేషన్, రోగనిరోధక శక్తి అందించే నిపుణులు ఉండాలని, ఈ కుక్కలను బయటకు వదలకూడదని, ఈ షెల్టార్ల నుండి కుక్కలు తప్పించుకోకుండా చూసుకోవడానికి సీసీటీవీలను ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది. కుక్క కాటు కేసులకి సంబంధించి  ఒక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని అధికారులకు కూడా సూచించింది.

రేబిస్ వ్యాక్సిన్ లభ్యత ఒక ప్రధాన ఆందోళన అని, సంబంధిత అధికారులు, ముఖ్యంగా ఎన్‌సిటి ఢిల్లీ ప్రభుత్వం వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న ప్రదేశం, వ్యాక్సిన్‌ల స్టాక్, ప్రతినెల ప్రాతిపదికన చికిత్స కోసం వచ్చే వారి గురించి సమాచారాన్ని అందించాలని కోర్ట్ ఆదేశించింది.