క్విక్ సర్వీస్: అలా15 నిమిషాల్లో వచ్చి అంట్లు తోమేస్తారు.. ఇల్లు తుడిచేస్తారు..! ఇంకా..

క్విక్ సర్వీస్: అలా15 నిమిషాల్లో వచ్చి అంట్లు తోమేస్తారు.. ఇల్లు తుడిచేస్తారు..! ఇంకా..

దేశంలో ప్రస్తుతం క్విక్ కామర్స్ రంగం వేగంగా విస్తరించిన సంగతి తెలిసిందే. కావాల్సిన కిరాణా సరుకుల నుంచి ఆహారం వరకు అన్నింటినీ జస్ట్ 15 నిమిషాల్లో అందించటానికి అనేక స్టార్టప్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. తీరికలేకుండా బిజిబిజీ లైఫ్ గడుపుతున్న చాలా మంది ప్రజలను నుంచి ఈ సేవలకు ఆధరణ లభిస్తోంది. దీనితోనే ప్రయోగాత్మకంగా బ్లింకిట్ 15 నిమిషాల్లో అంబులెన్స్ సేవలను ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. 

అయితే ఇదే తరహా సేవలు మరిన్ని హోమ్ సర్వీసెస్‌కు విస్తరిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ప్రస్తుతం క్విక్‌సర్వీస్, క్విక్‌రిపేర్స్ వంటి సేవలను అందించటానికి పోటీపడుతున్నాయి. నగరాల్లోని ప్రజలకు అవసరమైన క్లీనింగ్, కుక్కింగ్, రిపేర్స్ వంటి సేవలను నిమిషాల్లో అందింటానికి రంగం సిద్ధమైంది. స్నాబిట్, పైన్, ప్రోన్టో వంటి సంస్థలు బెంగళూరు, ముంబై, గురుగ్రామ్ వంటి నగరాల్లో కేవలం 10 నిమిషాల్లోనే అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఇంట్లో మాపింగ్, చిన్నచిన్న రిపేర్లు వంటి సేవలను అందిస్తున్నాయి.

ALSO READ : మరింత ఈజీగా పెట్రోల్ పంపు ఏర్పాటు..

ఇంట్లోని భార్యాభర్తలు ఇద్దరూ ఆదాయం కోసం పనిచేస్తున్నందున ఇంటి పనుల్లో కూడా సహాయకులు అవసరం అవుతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించటంతో ప్రస్తుతం రవాణా, ఈకామర్స్, క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ సేవలకు ప్రజలు అలవాటు పడటంతో తాము క్విక్ సర్వీసెస్ ఎంచుకున్నట్లు స్నాబిట్ వ్యవస్థాపకులు ఆయుష్ అగర్వాల్ చెబుతున్నారు. ప్రజలు ప్రతి పనిలోనూ వేగవంతమైన సేవలను కోరుకోవటంతో రేట్లు పెద్దగా పట్టింకోకపోవటం కూడా క్విక్ సర్వీసెస్ సంస్థలకు కలిసొస్తోంది. 

ప్రస్తుతం అర్బన్ కంపెనీ తన ఇన్ స్టా హెల్ప్ కింద హౌస్ కీపింగ్ సేవలను హైదరాబాద్, బెంగళూరు, ముంబై, దిల్లీ ఎన్సీఆర్ వంటి మెట్రో నగరాల్లో మార్చి నుంచి ప్రారంభించింది. సేవలను అందించటం కోసం సంస్థలు క్విక్ కామర్స్ మాదిరిగానే హబ్స్ ఏర్పాటు చేస్తూ ప్రజలకు వేగంగా సేవలను అందిస్తున్నాయి. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గి వారు కోరుకుంటున్నట్లు 10 నుంచి 15 నిమిషాల్లోనే సేవలను అందించటానికి అవకాశం వస్తోంది. ఇటువంటి సేవలకు డిమాండ్ భారీగానే ఉన్నప్పటికీ సప్లై ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు సంస్థ యజమానులు.